Breaking News

టాప్‌ 3 మార్కెట్లలో భారత్‌: ప్రముఖ సీఈఓ

Published on Fri, 04/17/2026 - 01:18

రాబోయే రోజుల్లో భారత్‌ తమ టాప్‌ 3 మార్కెట్లలో ఒకటిగా ఉంటుందని ఫ్రెంచ్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం రెనో గ్లోబల్‌ గ్రూప్‌ సీఈవో ఫ్రాంకోయిస్‌ ప్రొవోస్ట్‌ తెలిపారు. దేశీయంగా 5 శాతం మార్కెట్‌ వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా కొత్త మోడల్స్‌ని ప్రవేశపెట్టడం ద్వారా 2030 నాటికి తమ పోర్ట్‌ఫోలియోని ఏడు మోడల్స్‌కి విస్తరిస్తామని వివరించారు. అలాగే, అప్పటికల్లా విడిభాగాలు, టెక్నాలజీ సహా భారత్‌ నుంచి ఏటా 2 బిలియన్‌ యూరోల విలువ చేసే ఎగుమతులను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు ప్రొవోస్ట్‌ వివరించారు.

కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ’బ్రిడ్జర్‌ కాన్సెప్ట్‌’ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. భారత్‌లో రెనో గ్రూప్‌కి సంబంధించి తొలి పూర్తి ఎలక్ట్రిక్‌ వాహనంగా, తమ విద్యుత్‌ కార్ల ప్రస్థానంలో ఇది కీలకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  ఇప్పటికే ప్రవేశపెట్టిన కొత్త డస్టర్‌కి భారీ స్పందన లభిస్తోందని చెప్పారు. తమ గ్రూప్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మార్కెట్లలో మొత్తం వాహనాల పరిమాణంపరంగా భారత్‌ వాటా మూడో వంతు పైగా ఉంటుందని, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా తమ ఫ్యూచర్‌రెడీ ప్రణాళికల్లో భాగంగా భారత్‌తో పాటు యూరప్, దక్షిణ అమెరికాలో 36 మోడల్స్‌ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రొవోస్ట్‌ చెప్పారు.

#

Tags : 1

Videos

మైక్రో ఫైనాన్స్ స్కాంలో రామావత్ మధు అరెస్ట్, NEXT అరెస్ట్ ఎవరిది ?

హోదా పక్కన పెట్టి మానవత్వం.. తల్లీ, తండ్రి లేని మహిళా కానిస్టేబుల్ కు సీమంతం

నాకు రాజకీయాల్లో ఎన్నో విషయాలు నేర్పారు.. అవినాష్ కల్మషం లేని వ్యక్తి..

శ్రీయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్, ముంబై ఫ్యాన్స్ కు ఇచ్చిపడేసాడు

జగనన్న చేసినంత ఎవరూ చేయలేదు.. మహిళలకు సొంత అన్న జగన్

ఇండస్ట్రీని షేక్ చేసే ప్రాజెక్ట్.. 4000 కోట్లు లోడింగ్..

కేంద్ర ఉద్యోగులకి జాక్ పాట్ కనీస వేతనం 69 వేలకు పెంపు

కుప్పం కోర్టు చీవాట్లు.. జగన్ టూర్ గ్రాండ్ సక్సెస్

లోక్ సభలో పరువుపాయే.. TDP MLAల రాసలీలల వీడియోలపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్..

శ్రీరాముడు వలస కూలి.. నటుడు ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Photos

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)

+5

కోహ్లీ లైక్‌ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)

+5

ఏపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)