Breaking News

ఎకానమీ జోరుకు బ్రేకులు!

Published on Sat, 08/31/2024 - 04:04

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికం (క్యూ1)లో 6.7 శాతంగా నమోదయ్యింది. గడచిన 15 నెలల కాలంలో ఇంత తక్కువ వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. 2023 జనవరి–మార్చి త్రైమాసికంలో ఎకానమీ 6.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. వ్యవసాయం, సేవా రంగాల పేలవ పనితీరు తాజా లెక్కలపై ప్రభావం చూపినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) డేటా పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 8.2 శాతం. తాజా సమీక్షా కాలానికి ముందు త్రైమాసికంలో (జనవరి–మార్చి) రేటు 7.8 శాతం.  

6.7 శాతం వృద్ధి ఎలా అంటే.. 
2024–25 తొలి త్రైమాసికంలో 2011–12 స్థిర ధరల ప్రాతిపదికన  ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని మదింపుచేసే  జీడీపీ విలువ రూ.43.64 లక్షల కోట్లు. 2023–24 ఇదే కాలంలో ఇది రూ.40.91 లక్షల కోట్లు. అంటే వృద్ధి రేటు 6.7 శాతమన్నమాట.  ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికకాకుండా, ప్రస్తుత ధరల ప్రకారం  పరిశీలిస్తే,  2023  ఏప్రిల్‌–జూన్‌ మధ్య జీడీపీ విలువ 9.7 శాతం వృద్ధితో రూ.70.50 లక్షల కోట్ల నుంచి రూ.77.31 లక్షల కోట్లకు ఎగసింది.  

‘వృద్ధి వేగంలో టాప్‌’ ట్యాగ్‌ యథాతథం 
ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 4.7 శాతంగా నమోదయ్యింది. ఈ కాలంలో ప్రపంచంలోనే మరేదేశమూ 6.7 శాతం వృద్ధి రేటును అందుకోలేకపోవడంతో, ప్రపంచంలో వేగవంతమైన వృద్ధి రేటు విషయంలో భారత్‌ తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నట్లయ్యింది.  

జీవీఏ వృద్ధి 6.8 శాతం 
ఉత్పత్తికి సంబంధించిన వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుండా లెక్కించే స్థూల విలువ జోడింపు (జీవీఏ) వృద్ధి రేటు 2023–24 చివరి త్రైమాసికంలో 6.3 శాతంగా నమోదయితే, 2024–25 మొదటి త్రైమాసికంలో అరశాతం పెరిగి 6.8 శాతంగా నమోదయ్యింది.  వార్షికంగా చూస్తే జీవీఏ విలువ రూ.38.12 లక్షల కోట్ల నుంచి రూ.40.73 లక్షల కోట్లకు ఎగసింది. ఇది 6.8 శాతం వృద్ధి రేటుకాగా, గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.3 శాతం.  వివిధ రంగాల వృద్ధి తీరును స్థూలంగా జీవీఏ ప్రాతిపదికన పరిశీలిస్తారు.  
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి