కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!
Breaking News
రూపాయి మారకంలో ట్రేడ్ సెటిల్మెంట్పై ఫోకస్
Published on Sat, 10/17/2026 - 05:31
న్యూఢిల్లీ: సర్వత్రా ఆమోదయోగ్యత ఉన్న కరెన్సీ కొరతపరంగా సమస్యలు ఎదుర్కొంటున్న భాగస్వామ్య దేశాలు .. యథాప్రకారం దిగుమతులను కొనసాగించే వీలు కల్పించేలా రూపాయి మారకంలో వాణిజ్య లావాదేవీల సెటిల్మెంట్ని ప్రోత్సహించడంపై భారత్ దృష్టి పెడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
యుద్ధాలు సహా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా చాలా దేశాలు రుణాల ఊబిలో, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభంలో కూరుకుపోయాయని ఆమె వివరించారు. అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలు ఈ సమస్యలను పరిష్కరించేందుకు సంవత్సరాల సమయం పట్టేసిందని, పరిస్థితులు ఇప్పుడిప్పుడే కాస్త మెరుగవుతున్నాయని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో సదరు దేశాల దిగుమతుల అవసరాలను తీర్చుకునేందుకు స్థానిక కరెన్సీల్లో సెటిల్మెంట్ చేసుకునే వీలు కల్పిస్తే సమస్య కొంత పరిష్కారం కాగలదని ఐఎంఎఫ్–వరల్డ్ బ్యాంక్ వార్షిక సదస్సు సందర్భంగా మంత్రి చెప్పారు.
Tags : 1