Breaking News

ఏఐకి ప్రభుత్వ మద్దతు కావాలి

Published on Sat, 07/26/2025 - 06:14

న్యూఢిల్లీ: జాతీయ భద్రత దృష్ట్యా కృత్రిమ మేథకి (ఏఐ) ప్రభుత్వం మద్దతు అవసరమని నెక్స్‌జెన్‌ ఎగ్జిబిషన్స్‌ ఒక నివేదికలో తెలిపింది. పటిష్టమైన సైబర్‌సెక్యూరిటీ, బోర్డర్‌ సెక్యూరిటీ కోసం దీనిపై గణనీయంగా ఇన్వెస్ట్‌ చేయాలని, ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. 

15 నగరాలకు చెందిన 200 పైగా కంపెనీలతో నిర్వహించిన సర్వే ప్రాతిపదికన నెక్స్‌జెన్‌ ఈ నివేదిక రూపొందించింది. జాతీయ భద్రత కోసం ప్రభుత్వం ఏఐకి క్రియాశీలకంగా మద్దతునివ్వాలనే విషయంపై ’ఏకీభవిస్తున్నాను’, ’మరింతగా ఏకీభవిస్తున్నాను’ అనే ఆప్షన్లకు 86 శాతం మంది సానుకూలంగా స్పందించినట్లు సంస్థ తెలిపింది. 

డిఫెన్స్‌లో ఏఐ ఆవిష్కరణల కోసం ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యాలు, ప్రోత్సాహకాలు అవసరమని 14 శాతం మంది అభిప్రాయపడ్డారు. పరిశ్రమలో ఏఐ అంతరాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యాలు ఉపయోగపడగలవని పేర్కొన్నారు. దేశ భద్రతను పటిష్టం చేసుకునే దిశగా ఏఐని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలంటే పాలసీపరంగా ఉన్న అనేక అంతరాలను ప్రభుత్వం, పరిశ్రమ పరిష్కరించుకోవాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది.  

ఎల్రక్టానిక్‌ యుద్ధాలు, సమాచార యుద్ధాలతో సవాళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఏఐ ఎంతో ఉపయోగకరమైన సాధనంగా ఉండగలదని నెక్స్‌జెన్‌ పేర్కొంది. పరిశ్రమ గణాంకాల ప్రకారం 2024లో దేశీయంగా 23 లక్షల పైగా సైబర్‌దాడులు చోటు చేసుకున్నాయి. వీటి వల్ల రూ. 1,200 కోట్ల మేర ఆరి్థక నష్టం వాటిల్లింది. అంతర్జాతీయంగా ఫిషింగ్‌ దాడుల విషయంలో అమెరికా, రష్యా తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉంది.   
 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)