Breaking News

భారత్‌లో రెట్టింపు రేడియో థెరపీ మెషీన్లు అవసరం

Published on Tue, 06/20/2023 - 07:20

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత్‌లో ఏటా క్యాన్సర్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2020లో కొత్తగా 13.25 లక్షల కొత్త కేసులు రాగా 8.5 లక్షల మంది క్యాన్సర్‌ సంబంధ సమస్యలతో మరణించారు. ఈ నేపథ్యంలో దేశీయంగా సకాలంలో సరైన చికిత్స అందించేందుకు రేడియో థెరపీ మెషీన్ల సంఖ్య రెట్టింపు స్థాయికి పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఎలెక్టా ఇండియా ఎండీ మణికందన్‌ బాలా సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. 

ప్రస్తుతం భారత్‌లో 650 పైచిలుకు మెషీన్లు ఉండగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం జనాభారీత్యా 1,400 వరకు అవసరమని ఆయన చెప్పారు. నివేదికల ప్రకారం తెలంగాణలో 2025 నాటికి కొత్త క్యాన్సర్‌ కేసుల సంఖ్య 53,000 పైచిలుకు ఉండనుందన్నారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు, చికిత్స వ్యయాలను తగ్గించి .. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. 

ఇందుకోసం ప్రభుత్వాలు, ప్రైవేట్‌ ఆస్పత్రులతో చర్చలు జరుపుతున్నామని బాలా చెప్పారు. ఎంఆర్‌–లినాక్‌ వంటి అధునాతన మెషీన్లను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించి దేశీయంగా తమ మెషీన్లు 500 పైచిలుకు ఉన్నట్లు వివరించారు. ఎలెక్టాకు అమెరికా, బ్రిటన్, చైనా తదితర దేశాల్లో తయారీ ప్లాంట్లు ఉన్నాయి.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)