Breaking News

భారత్‌లో సాగు ఆధునీకరణ చర్యలు భేష్‌

Published on Sun, 09/15/2024 - 00:40

పానిపట్‌: భారత్‌లో సాగు రంగాన్ని ఆధునీకరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జర్మన్‌ కెమికల్స్‌ దిగ్గజం బేయర్‌ దక్షిణాసియా ప్రెసిడెంట్‌ సైమన్‌ వీబుష్‌ ప్రశంసించారు. వెనుకబడిన వ్యవసాయ రంగంతో భారత్‌ నిర్దేశించుకున్నట్లుగా 2047 నాటికి అగ్రరాజ్యంగా అవతరించడం సాధ్యపడదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న పలు చర్యలు వ్యవసాయాన్ని ఆధునీకరించడమే లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోందని సైమన్‌ చెప్పారు. 

భారత్‌ వినూత్న ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ, రెగ్యులేటరీ ప్రక్రియలను మరింతగా డిజిటలీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయంలో కూలీల కొరత నెలకొన్న నేపథ్యంలో తాము కలుపు మందులపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. క్రిమిసంహారకాల కన్నా అధికంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు వివరించారు. వరి, గోధుమలు, చెరకు వంటి కీలక పంటల కోసం కలుపు మందులను అభివృద్ధి చేస్తున్నామని సైమన్‌ చెప్పారు. అంతర్జాతీయంగా తాము నిర్వహిస్తున్న ’ఫార్వర్డ్‌ఫామ్స్‌’ కార్యక్రమం ద్వారా భారత్‌లో కూడా వ్యవసాయ ఉత్పాదకతను, ఆగ్రో–కెమికల్స్‌ను మెరుగుపర్చే కొత్త ఆవిష్కరణలను పరిశీలిస్తున్నామని తెలిపారు.

#

Tags : 1

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)