భారత్ వృద్ధికి 3i స్ట్రాటజీ!.. వరల్డ్ బ్యాంక్ సూచన

Published on Fri, 08/02/2024 - 08:08

భారత్, చైనా వంటి సుమారు 106 దేశాలు మధ్య ఆదాయ ఉచ్చు (మిడిల్ ఇన్‌కమ్‌ ట్రాప్)లో పడే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. దీని నుంచి తప్పించుకోవడానికి పెట్టుబడులు, ఆవిష్కరణలతో పాటు.. కొత్త టెక్నాలజీలను కూడా అభివృద్ధి చేయడం మీద దృష్టి సారించే 3i (ఇన్వెస్ట్‌మెంట్, ఇన్నోవేషన్, ఇన్‌ఫ్యూజన్‌) విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.

ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ.. ప్రస్తుత ట్రెండ్ ఇలంగో కొనసాగితే దేశ తలసరి ఆదాయం అమెరికా ఆదయ స్థాయిలలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి దాదాపు 75 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో స్పష్టం చేసింది.

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను ప్రపంచ బ్యాంక్ తన 'వరల్డ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2024'లో.. స్వాతంత్య్ర శతాబ్దిగా ప్రస్తావించింది. భారతదేశం ఆర్థిక వ్యవస్థలో పరివర్తన సాధించాలని ఆశిస్తున్నప్పటికీ.. అది కొంత క్లిష్టంగా కనిపిస్తున్నట్లు వెల్లడించింది.

ఇప్పటికి కూడా అనేక దేశాలు గత శతాబ్దానికి చెందిన ప్లేబుక్‌ను ఉపయోగిస్తున్నాయి. ప్రధానంగా పెట్టుబడులను విస్తరించేందుకు రూపొందించిన విధానాలపై ఆధారపడుతూ ఉన్నయని.. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ ఇండెర్మిట్ గిల్ పేర్కొన్నారు. ఇది మొదటి గేర్‌లోనే కారు నడుపుతూ వేగంగా ముందుకు వెళ్లాలనుకోవడంలాంటిదని అన్నారు.

ఇది ఇలాగే కొనసాగితే.. అమెరికా తలసరి ఆదాయంలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి ఇండియాకు 75 ఏళ్ళు, చైనాకు 10 సంవత్సరాలు, ఇండోనేషియా దాదాపు 70 సంవత్సరాలు పడుతుందని గిల్ అన్నారు. చైనా, ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు రాబోయే కొన్ని దశాబ్దాల్లో తీవ్రమైన అడ్డంకులను ఎదుర్కునే అవకాశం ఉందని ఆయన అన్నారు. 1990 నుంచి కేవలం 34 దేశాలు మాత్రమే మిడిల్ ఇన్‌కమ్‌ ట్రాప్ నుంచి తప్పించుకోగలిగాయని ఆయన అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)