Breaking News

కీలక టెక్నాలజీల్లో భారత్‌ స్వావలంబన సాధించాలి 

Published on Fri, 12/12/2025 - 06:06

గాందీనగర్‌: దేశ పురోగతికి అవరోధాలుగా మారే భౌగోళిక, రాజకీయ సవాళ్లను అధిగమించే దిశగా కీలక టెక్నాలజీలను సమకూర్చుకోవడం, పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడంలో భారత్‌ స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ధీమా సడలిపోతుంటే భారత్‌ మాత్రం ఆకాంక్షలు, ఆత్మ విశ్వాసంతో ఉత్సాహంగా ముందుకు ఉరకలేస్తోందని.. అధిక ఆర్థిక వృద్ధి సాధిస్తోందని పండిట్‌ దీనదయాళ్‌ ఎనర్జీ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవం తెలిపారు. ‘దశాబ్దం క్రితం మిగతా దేశమంతా వైబ్రెంట్‌ గుజరాత్‌ గురించి మాట్లాడుకునేది. 

ఇప్పుడు మిగతా ప్రపంచమంతా వైబ్రెంట్‌ ఇండియా గురించి మాట్లాడుకుంటోంది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్‌ సుమారు 8 శాతం వృద్ధి సాధిస్తోంది. కృత్రిమ మేథ, నూతన ఇంధనాలు, స్పేస్, బయోటెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌లాంటి క్రిటికల్‌ టెక్నాలజీలు, పరిశ్రమల విషయంలో స్వావలంబన సాధించాలి. ఈ రేసులో గెలి్చనవారే విశ్వవిజేతలు‘ అని అంబానీ పేర్కొన్నారు. టెక్నాలజీ శరవేగంగా మారిపోతున్న నేపథ్యంలో ఆసక్తి, ధైర్యాన్ని మార్గదర్శక సూత్రాలుగా పాటించాలని విద్యార్థులకు ఆయన సూచించారు.  
 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు