వాయిదాల వార్నింగ్‌!

Published on Mon, 02/09/2026 - 00:47

ఆదాయాలు పెరుగుతున్నాయి. మధ్య తరగతి ఎదిగి... ఎగువ మధ్య తరగతిగా మారుతోంది. కాకపోతే ఈ ఆదాయాలతో పాటు ఆకాంక్షలూ పెరుగుతున్నాయి. ఇది సహజమే. ఇందులో తప్పేమీ లేదు. కాకపోతే చిక్కల్లా... మధ్య తరగతి పొదుపు తగ్గుతుండటమే. ఎందుకంటే దేశంలో పొదుపు మొత్తాల శాతం దశాబ్దాల కనిష్ఠానికి చేరిపోతోంది. ఇది నిశ్శబ్దంగా విస్తరిస్తున్న ప్రమాదకరమైన ధోరణికి సంకేతంగా కనిపిస్తోంది.

 అదేంటంటే... ఈఎంఐల ఉచ్చు. ఇళ్లు, కార్లు, గ్యాడ్జెట్లు, విహారయాత్రలు, విద్య... ఇలా ప్రతిదీ ఇపుడు ‘సులభతరమైన’ నెలవారీ వాయిదాల్లో దొరికేస్తోంది. దీనికి కంపెనీలు పెడుతున్న ముద్దుపేరు బీఎన్‌పీఎల్‌. ఇప్పుడు కొనండి... తరువాత చెల్లించండి. ఈ ఈజీ కొనుగోళ్ల మాయలో పడి ఆర్థిక ప్రణాళికలను, క్రమశిక్షణను అటకెక్కించే పరిస్థితి ఏర్పడుతోంది. దీన్నుంచి బయటపడకపోతే ఉచ్చులో చిక్కుకుని ఊబిలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలంటూ 
హెచ్చరిస్తున్నదే ఈ ‘వెల్త్‌ స్టోరీ’.

ఈఎంఐల సమస్య ఎకాయెకిన కాకుండా నెమ్మదిగా, ఒక్కొక్కటిగా మొదలవుతోంది. క్రమంగా పెనుభారంగా మారి కుటుంబాలను అస్తవ్యస్తం చేస్తోంది. తామరతంపరగా పెరిగిపోయే ఈఎంఐలు, నెలవారీ ఆదాయంలో సింహభాగాన్ని తినేస్తున్నాయి. అప్పులకు, ఇంటి అవసరాలకు చెల్లించేయగా.. చివరికి పొదుపు చేసేందుకు పైసా మిగ లని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఎప్పటికప్పుడు పొదుపు వాయిదా పడిపోతుంది. 

ఇది ఒక స్థాయిని చేరాక పొదుపు సంగతి పక్కనబెడితే ఖర్చులకూ సరిపోని పరిస్థితి. వీటికి తోడు ఊహించని విధంగా ఏ చిన్న కుదుపు వచ్చినా (ఉద్యోగం పోవడం, వైద్యం ఖర్చుల్లాంటివి) అప్పుల కోసం హైరానా పడిపోయే పరిస్థితి. ప్రస్తుతం చాలా  కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంటోంది. గృహ రుణం ఈఎంఐ, కారు రుణం ఈఎంఐ, వ్యక్తి గత రుణం లేదా క్రెడిట్‌ కార్డ్‌ ఈఎంఐ, విద్యారుణం ఈఎంఐ ఇలా ప్రతి దానికి ఈఎంఐలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.

లెక్కేసుకుంటే.. .
సాధారణంగా ఈఎంఐల గురించి ఫైనాన్షియల్‌ ప్లానర్లు చెప్పే సూత్రం ఒకటి ఉంది. నెలవారీ ఆదాయంలో ఈఎంఐల భారం 30–35 శాతానికి మించకూడదు. కానీ వాస్తవంగా పట్టణ ప్రాంతాల్లోని చాలా కుటుంబాల్లో వాయిదాల భారం 50–60 శాతం పైగా ఉంటోంది. ఇక క్రెడిట్‌ కార్డ్‌ రోలోవర్స్‌ గురించి చెప్పనక్కర్లేదు. ప్రతి నెలా అలా పెరుగుతూనే ఉంటోంది. డిఫాల్ట్‌ ముప్పును అటుంచితే కనీసం ఊపిరి కూడా తీసుకోలేని ఆందోళనకర పరిస్థితి నెలకొంటోంది.

ఈ సమస్య ఎందుకింత వేగంగా పెరుగుతోంది..  
అప్పులు, ఈఎంఐల సమస్య వేగంగా పెరుగుతుండటానికి చాలా కారణాలు ఉంటున్నాయి. వీటిలో కొన్ని... రుణాలు సులువుగా దొరకడం ఇప్పుడు రుణం తీసుకోవడమనేది గతంలోలాగా సుదీర్ఘ ప్రక్రియగా ఉండటం లేదు. క్షణాల్లో లోన్స్‌ కి అప్రూవల్‌ లభిస్తోంది. నిమిషాల్లో క్రెడిట్‌ అయి పోతోంది.  

జీవన విధానంపరమైన ద్రవ్యోల్బణం 
జీతం పెరిగిందంటే చాలు లైఫ్‌ స్టయిల్‌ని కూడా మార్చేసే ధోరణి ఉంటోంది. దానికి తగ్గట్లుగా లోన్‌ తీసుకోవడం, ఇంకో కొత్త ఈఎంఐని జోడించుకోవడం చక చకా జరిగిపోతోంది. 

‘‘నో–కాస్ట్‌ ఈఎంఐ’’ భ్రమ 
అసలు వడ్డీ ప్రసక్తే ఉండదు.. తీసుకున్నంతే కట్టొచ్చు అని ఆర్థిక సంస్థలు ఊరిస్తుంటాయి. కానీ మన లెక్కకు అందని, మనకు తెలియని వడ్డీ ఎంతో కొంత ఉంటుందనేది అర్థం చేసుకోవాలి. 

సామాజిక ఒత్తిళ్లు 
వచ్చినదానితో ఇంట్లో ఎంతగా సర్దుకుని ఉందామనుకున్నా హంగులు, ఆర్భాటాలు లేకపోతే ఉపయోగం లేదు అనే రకంగా సామాజిక ఒత్తిడి ఉంటోంది. ఖరీదైన ఇళ్లు, కార్లు, గ్యాడ్జెట్స్‌ లాంటివి విజయానికి గుర్తుల్లాగా ఉంటున్నాయి.  

చెల్లించుకోక తప్పదు మూల్యం.. 
ఈఎంఐలు అడ్డదిడ్డంగా పెరిగిపోవడం వల్ల చాలా దుష్పరిణామాలు కూడా ఎదురవుతాయి. ఎమర్జెన్సీ నిధి అనేది ఎప్పటికీ ఏర్పాటు చేసుకోలేం. పిల్లల చదువులకు సంబంధించిన ప్రణాళికలు దెబ్బతింటాయి. రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేద్దామనుకున్నా నిరవధికంగా వాయిదా పడుతూనే ఉంటుంది. వీటన్నింటి వల్ల శాశ్వత ప్రాతిపదికన ఒకే ఒక్కటి లభిస్తుంది. అదేంటంటే మానసిక ఒత్తిడి. చాలా కుటుంబాలు ఆర్థికంగా స్థిరంగానే ఉన్నట్లు కనిపిస్తుంటాయి. కానీ ట్రబుల్‌ అనేది ఆసుపత్రి వ్యయాల రూపంలో కూతవేటు దూరంలోనే ఉంటుంది.

మూడు ప్రశ్నలు.. 
ఏ రుణం తీసుకోవాలన్నా ముందుగా మీకు మీరు ఓ మూడు ప్రశ్నలు వేసుకోండి. అవేంటంటే.. 
→ ఈ ఈఎంఐ తీసుకున్న తర్వాత కూడా పొదుపును యథాప్రకారం కొనసాగించగలనా? 
→ ఒక 3 నెలల పాటు ఆదాయం రాకపోయినా కూడా ఈఎంఐలను కట్టగలనా? 
→ ఈఎంఐపై కొనుక్కుంటున్నదేదైనా సరే నా భవిష్యత్తును మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుందా, లేక కేవలం లైఫ్‌స్టయిల్‌కే పనికొచ్చేదా? 

వీటిల్లో దేనికైనా సరే జవాబు ‘‘నో’’ అని వస్తే.. కాస్త ఆలోచించండి. 
చివరిగా చెప్పేదేమిటంటే.. రుణాలు, ఈఎంఐలనేవి చెడ్డవి కావు. కాకపోతే ఈఎంఐలు మరీ ఎక్కువైపోతే ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అనిశ్చితి నెలకొన్న తరుణంలో షో కోసం అప్పు మీద కొని పెట్టుకునేవాటికంటే పొదుపు చేయడం, చేతిలో డబ్బు ఆడటమే చాలా ముఖ్యమని గుర్తెరగాలి.

బయటపడేదిలా.. 
పీకల్లోతు ఈఎంఐల ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితి నెలకొన్నప్పటికీ కాస్తంత సరిగ్గా ప్లాన్‌ చేసుకుంటే దాన్నుంచి తప్పించుకోవడం కష్టమేమీ కాదు. అదెలాగో చూద్దాం.. 
1.    ఈఎంఐలకు ఒక పరిమితి విధించుకోవాలి 
→ మొత్తం ఈఎంఐల భారం నెలకు నికరంగా వచ్చే ఆదాయంలో మూడో వంతు స్థాయికి మించకుండా చూసుకోవాలి. 
→ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదని డిసైడ్‌ కావాలి. 
2.    ముందుగా ఎమర్జెన్సీ ఫండ్‌ని ఏర్పాటు చేసుకోండి
→ ఎటు పోయి ఎటొచ్చినా కనీసం 6 నెలల         ఖర్చులకు సరిపడేంత నిధిని పక్కన పెట్టుకోవాలి. 
→ ఆ తరువాతే కొత్త లోన్స్‌ గురించి ఆలోచించాలి.  
3.    అధిక వడ్డీ రుణాల నుంచి బైటపడాలి 
→ ముందుగా వడ్డీ భారం ఎక్కువగా ఉండే క్రెడిట్‌ కార్డులపై రుణాలు, వ్యక్తిగత రుణాలను తీర్చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. 
→ కాస్త కాస్త చొప్పున ప్రీపేమెంట్‌ చేసినా, భారీగా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. 
4.    ‘‘అవసరం’’, ‘‘అప్‌గ్రేడ్‌’’కి మధ్య వ్యత్యాసం.
→ సాధారణంగా మనకి అవసరమైనవి కొన్ని ఉంటాయి. స్థాయిని చూపించుకునేందుకు తీసుకునేవి కొన్ని ఉంటాయి. ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకుంటే చాలు.  ఉదాహరణకు సొంత ఇల్లు అనేది ఒక అవసరం. కానీ ఖరీదైన కార్లు,  కొత్త గ్యాడ్జెట్స్‌కు మారుతుండటమనేది అప్‌గ్రేడ్‌ కావాలనే తాపత్రయానికి నిదర్శనం. 

Videos

తప్పు ఒప్పుకున్న చంద్రబాబు.. ఫైన్ కట్టిన హెరిటేజ్

Perni Nani: మీరు మనుషులా.. రాక్షసులా..? రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు

గుంటూరు కోర్టుకు అంబటి రాంబాబు

చిరు పక్కన సారా అర్జున్.. కృతి శెట్టి కథ కంచికేనా..?

సౌందర్య, మోహన్ బాబు వివాదంపై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్

జాతిపిత ఎవరు? కేసీఆర్, జయశంకర్, శ్రీకాంతాచారి

గతంలో బూతు బొమ్మలు & బూతు పుస్తకాల కోసం చాలా కష్ట పడేవాళ్ళం.. కానీ ఇప్పుడు..!

వైఎస్ జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలు

డొల్ల కంపెనీలతో బిగ్ స్కామ్.. OTP లేకుండానే 5 వేల కోట్లు..

లక్షను 40 లక్షలు చేసిన స్టాక్.. జేబులు నింపుకున్న ఇన్వెస్టర్లు..

Photos

+5

గ్లామర్‌తో పడేస్తున్న శ్రద్ధా దాస్‌.. నెట్టింట ఫోటోలు వైరల్‌

+5

హైదరాబాద్ : చార్మినార్ వద్ద ఆధ్యాత్మిక శోభ (ఫొటోలు)

+5

కుటుంబ వివాహ వేడుక.. తమిళనాడు ప్రముఖులకు వైఎస్‌ జగన్‌ ఆత్మీయ పలకరింపు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలీల, థమన్‌, తేజ సజ్జా (ఫోటోలు)

+5

వివాహ వేడుకలో వైఎస్‌ జగన్‌.. జననేతకు ఆత్మీయ పలకరింపులు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ బర్త్ వేడుకల్లో మన్మధుడు హీరోయిన్ అన్షు.. (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్‌ 2026 (ఫొటోలు)

+5

టి20 వరల్డ్‌ కప్‌ ప్రారంభ వేడుక అదుర్స్‌ (ఫొటోలు)

+5

సాక్షి మీడియా గ్రూప్‌, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)