ఎగుమతులు జూమ్‌

Published on Fri, 11/15/2024 - 04:15

న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి మందగిస్తుందన్న ఆందోళనల నడుమ దేశ ఎగుమతులు ప్రోత్సాహకర స్థాయిలో పెరిగాయి. అక్టోబర్‌ నెలలో ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 39.2 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. చివరిగా 2022 జూన్‌ నెలలో ఎగుమతుల్లో 30 శాతం వృద్ధి నమోదైంది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసి గణాంకాలను పరిశీలించగా.. అక్టోబర్‌లో దిగుమతులు 3.9 శాతం పెరిగి 66.34 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

 క్రితం ఏడాది ఇదే నెలలో దిగుమతులు 63.86 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా ముడి చమురు దిగుమతులు 13.34 శాతం పెరిగాయి. దీంతో వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం) 27.14 బిలియన్‌ డాలర్లకు చేరింది. సెపె్టంబర్‌ చివరికి ఇది 20.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. క్రితం ఏడాది అక్టోబర్‌ నెలతో పోల్చి చూస్తే వాణిజ్య లోటు 3.29 బిలియన్‌ డాలర్ల మేర తక్కువగా ఉంది.  

చమురు, నూనెల దిగుమతులు అధికం.. 
→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ మధ్య ఎగుమతులు 3.18 శాతం పెరిగి 252.28 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇదే కాలంలో దిగుమతులు 5.77 శాతం ఎగసి 416.93 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఏడు నెలల కాలంలో వాణిజ్య లోటు 164.65 మిలియన్‌ డాలర్లకు ఎగిసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 149.67 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  
→ ఏప్రిల్‌–అక్టోబర్‌ మధ్య సేవల ఎగుమతులు 216 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 192 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.  
→ అక్టోబర్‌లో ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చతే 40 శాతం పెరిగి 11.25 బిలియన్‌ డాలర్లకు చేరగా.. ఎల్రక్టానిక్స్‌ ఉత్పత్తుల ఎగుమతులు 46 శాతం వృద్ధితో 3.43 బిలియన్‌ డాలర్లకు ఎగిశాయి.  
→ వెజిటబుల్‌ ఆయిల్‌ దిగుమతులు 36 శాతం మేర పెరిగాయి.  
→ బంగారం దిగుమతులు సైతం సెపె్టంబర్‌లో ఉన్న 4.39 బిలియన్‌ డాలర్ల నుంచి అక్టోబర్‌లో 7.13 బిలియన్‌ డాలర్లకు ఎగిశాయి. క్రితం ఏడాది అక్టోబర్‌లో 7.23 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 
→ ముడి చమురు దిగుమతులు 12.5 బిలియన్‌ డాలర్ల నుంచి 18.2 బిలియన్‌ డాలర్లకు దూసుకెళ్లాయి.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)