Breaking News

శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్: నెలకు రూ.840 కంటే తక్కువే..

Published on Sat, 05/24/2025 - 17:26

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారతదేశం స్టార్‌లింక్‌ సేవలను ప్రారంభించడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తరుణంలో ఇతర సంస్థలు కూడా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను స్టార్ట్ చేయడానికి సన్నద్ధమవుతాయి. శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీలు ప్రారంభంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి నెలకు 10 డాలర్లు లేదా రూ.840 కంటే తక్కువ ధరలోనే అపరిమిత డేటా అందించాలని యోచిస్తున్నాయి.

తొలి దశలో కంపెనీలన్నీ యూజర్లను పెంచుకోవడంపై ద్రుష్టి సారించనున్నాయి. సుమారు 10 మిలియన్స్ కస్టమర్లను చేరుకోవడం ద్వారా స్పెక్ట్రమ్‌ కాస్ట్‌ను భర్తీ చేసుకోవడం సాధ్యమవుతుందని సంస్థలు భావిస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) పట్టణ ప్రాంతాల్లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు నెలకు రూ. 500 ఛార్జ్ చేయాలని ప్రతిపాదించింది. ఈ ధర సాధారణ సర్వీసులతో పోలిస్తే చాలా ఎక్కువ.

ట్రాయ్ సిఫార్సులలో సర్దుబాటు చేసిన స్థూల ఆదాయంలో 4 శాతం లెవీ, MHz స్పెక్ట్రానికి సంవత్సరానికి రూ.3500 ఫీజు వంటివి ఉన్నాయి. అంతే కాకుండా శాటిలైట్ ఉపగ్రహ కమ్యూనికేషన్ ప్రొవైడర్లు వాణిజ్య సేవలను అందించడానికి 8 శాతం లైసెన్స్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలను అమలు చేయడానికి ముందు.. ప్రభుత్వ ఆమోదం లభించాల్సి ఉంది.

లైసెన్స్‌ ఫీజులు.. స్పెక్ట్రమ్‌ ఛార్జీలు ఉన్నప్పటికీ యూజర్లను పెంచుకునేందుకు తక్కువ ధరకే శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను భారతదేశంలో ప్రారంభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా దేశంలో స్టార్‌లింక్‌ సేవలను ప్రారంభించడానికి టెలికాం విభాగం నుంచి అనుమతులు లభించాయి. అయితే ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (IN-SPACe) ఆమోదం లభించాల్సి ఉంది.

ఇదీ చదవండి: 'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి

స్టార్‌లింక్‌ మాత్రమే కాకుండా.. యూటెల్సాట్ వన్‌వెబ్‌ (Eutelsat OneWeb), జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ (Jio Satellite Communications) కూడా వరుసగా 2021, 2022లో టెలికాం విభాగం నుంచి అనుమతులు పొందాయి. ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. ఈ ఆమోదం లభించిన తరువాత శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారతదేశంలో అందుబాటులోకి రానున్నాయి.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)