Breaking News

అన్ని టూవీలర్లలో ఏబీఎస్‌ తప్పనిసరి

Published on Fri, 06/20/2025 - 16:15

రోడ్డు భద్రతను పెంపొందించే నిర్ణయాత్మక చర్యలో భాగంగా 2026 జనవరి 1 నుంచి ఇంజిన్ సామర్థ్యంతో సంబంధం లేకుండా అన్ని కొత్త ద్విచక్ర వాహనాలకు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ (ఏబీఎస్) అమర్చాలని భారత ప్రభుత్వం తెలిపింది. 125 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలకు మాత్రమే ఏబీఎస్ ఉండాలనే మునుపటి నిబంధనను ఈ నిర్ణయంతో సవరించినట్లయింది.

పెరుగుతున్న ప్రమాదాలు

దేశవ్యాప్తంగా రోడ్డు మరణాల్లో 44 శాతం ద్విచక్రవాహనాల వల్ల జరుగుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఆకస్మిక బ్రేకింగ్ సమయంలో వీల్ లాక్‌ను నిరోధించే టెక్నాలజీ ఏబీఎస్‌ను ప్రవేశపెట్టడం వల్ల ప్రమాదాలు 45 శాతం వరకు తగ్గుతుందని తెలుపుతున్నాయి. ఈ టెక్నాలజీని అన్ని ద్విచక్రవాహనాల్లో అమలు చేస్తే ప్రమాద సంబంధిత గాయాలు, మరణాలను తగ్గించడంలో ఇది కీలకంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.

త్వరలో రెండు హెల్మెట్లు..

ద్విచక్రవాహనాల్లో ఏబీఎస్‌ను తప్పనిసరి చేయడంతోపాటు అన్ని వాహన డీలర్లు రెండు బీఐఎస్ సర్టిఫైడ్ హెల్మెట్లను అందించాలనేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒకటి రైడర్ కోసం, మరొకటి వెనుక కూర్చున్న వ్యక్తికి ఉపయోగపడుతుందని చెప్పాయి. హెల్మెట్ వాడకాన్ని పెంచడంతోపాటు రైడర్ భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపాయి.

ఇదీ చదవండి: అడ్వాన్స్‌గా ఆరు నెలల రెంట్‌.. ఆపై ఎన్నో ఛార్జీలు

ధరలు పెరుగుతాయా..?

ఏబీఎస్‌ భద్రతా ఫీచర్లు వాహన ధరలను పెంచుతాయని కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ మోడళ్ల ధరలు ఇది రూ.2,500 నుంచి రూ.5,000 వరకు పెరగవచ్చనే అభిప్రాయాలున్నాయి. లక్షలాది మంది భారతీయులకు ద్విచక్ర వాహనాలు ప్రధాన రవాణా సాధనంగా ఉన్నాయని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది.

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)