Breaking News

రెండేళ్లలో తగ్గనున్న లాజిస్టిక్స్‌ వ్యయాలు

Published on Sun, 10/20/2024 - 00:58

న్యూఢిల్లీ: జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలను పెద్ద ఎత్తున నిర్మిస్తున్న నేపథ్యంలో రెండేళ్లలో స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) లాజిస్టిక్స్‌ వ్యయాల వాటా 9%కి తగ్గుతుందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా ఇది 14% ఉన్నట్లు చెప్పారు. అమెరికాతో పాటు యూరప్‌లోని పలు పెద్ద దేశా ల్లో ఈ వ్యయాలు 12% ఉండగా చైనాలో 8 శాతంగా ఉన్నట్లు నీతి ఆయోగ్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివరించారు. 

2022–23 ఎకనమిక్‌ సర్వే ప్రకారం దేశ జీడీపీలో లాజిస్టిక్స్‌ వ్యయాలు 14–18%గా ఉన్నాయి. అంతర్జాతీయ సగటు 8% తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. ప్రత్యామ్నాయ ఇంధనాలను ఎగుమతి చేసేందుకు భారత్‌కు భారీగా అవకాశాలు ఉన్నాయని గడ్కరీ చెప్పారు. తక్కువ నాణ్యత గల బొగ్గును మిథనాల్‌ తయారీకి ఉపయోగించవచ్చన్నారు. జీవ ఇంధనాల విభాగంలో దేశం గణనీయంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. 

రహదార్ల నిర్మాణంలో రీసైకిలింగ్‌ చేసిన టైర్‌ పౌడరు, ప్లాస్టిŠక్‌ మొదలైన మెటీరియల్స్‌ను వినియోగించడం వల్ల బిటుమిన్‌ దిగుమతులు తగ్గగలవని మంత్రి వివరించారు. మరోవైపు, దేశీ ఆటోమొబైల్‌ పరిశ్రమను ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. గతేడాదే జపాన్‌ను దాటేసి అమెరికా, చైనా తర్వాత మూడో అతి పెద్ద ఆటోమొబైల్‌ మార్కెట్‌గా భారత్‌ ఆవిర్భవించిందని గడ్కరీ చెప్పారు. 2014లో రూ. 7.5 లక్షల కోట్లుగా ఉన్న దేశీ మార్కెట్‌ 2024 నాటికి రూ. 18 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)