Breaking News

హరిత హైడ్రోజన్‌కు త్వరలో మార్గదర్శకాలు

Published on Fri, 01/06/2023 - 06:09

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా హరిత హైడ్రోజన్‌ తయారీకి భారత్‌ను ప్రధాన హబ్‌గా తీర్చిదిద్దే విధంగా త్వరలోనే ప్రమాణాలు, మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ తెలిపారు. దేశీయంగా ఎలక్ట్రోలైజర్ల తయారీ కోసం 15 గిగావాట్ల సామర్థ్యానికి సంబంధించి ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకంపై (పీఎల్‌ఐ) కసరత్తు చేసినట్లు ఆయన చెప్పారు. 2030 నాటికి దీన్ని 60 గిగావాట్ల స్థాయికి పెంచుకోవాలని భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

దేశీయంగా తయారీని ప్రోత్సహించే క్రమంలో ఎలక్ట్రోలైజర్లను  తక్కువ సుంకాలతో ఎప్పటివరకూ దిగుమతి చేసుకోవచ్చనేది కేంద్రం నిర్దిష్ట గడువు నిర్దేశిస్తుందని, ఆ తర్వాత నుంచి భారీ సుంకాలు అమల్లోకి వస్తాయ ని చెప్పారు. అలాగే హరిత హైడ్రోజన్‌ తయారీలో దేశీ పరిశ్రమ తగు రీతిలో పోటీపడే స్థాయికి ఎదిగే వరకూ తొలుత కొన్నేళ్ల పాటు పీఎల్‌ఐ స్కీము అందుబాటులో ఉంటుందని సింగ్‌ వివరించారు. దాదాపు రూ. 19,744 కోట్ల  జాతీయ హరిత హైడ్రోజన్‌ మిషన్‌ను కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించిన నేపథ్యంలో ఆయన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మిషన్‌ కింద వచ్చే అయిదేళ్లలో 5 మిలియన్‌ టన్నుల హరిత హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)