Breaking News

చమురు దిగుమతిని తగ్గించే వ్యూహం

Published on Fri, 06/05/2026 - 09:04

భారత ఇంధన రంగంలో స్వావలంబన సాధించడమే లక్ష్యంగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ‘ఈ85 ఫ్లెక్స్‌ ఇంధనం’ను అధికారికంగా ఈరోజు(జూన్‌ 5)విడుదల చేయనుంది. ఈ సరికొత్త ఇంధనంలో 80 నుంచి 85 శాతం ఇథనాల్, కేవలం 15 నుంచి 20 శాతం మాత్రమే పెట్రోల్ (మోటార్ గ్యాసోలిన్) ఉంటాయి. మారుతి సుజుకి సంస్థ దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును ఆవిష్కరించిన సందర్భంగా.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ ప్రకటన చేశారు. ఈ చొరవతో దేశంలో ఇథనాల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మరింత పెరగనుంది.

తొలిదశలో 50 నుంచి 100 ఇంధన స్టేషన్లు

ప్రారంభ దశలో భాగంగా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, పుణె, నాగ్‌పూర్ పరిధిలోని 50 నుంచి 100 రిటైల్ అవుట్‌లెట్లలో ఈ ఇథనాల్ పంపిణీ స్టేషన్లను ప్రారంభించనున్నారు. దేశంలోనే అత్యధిక వాహన జనాభా, ఇంధన వినియోగం ఉన్న ఈ నగరాలను పైలట్ ప్రాజెక్ట్ కోసం వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. దీనివల్ల వినియోగదారులకు ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలపై అవగాహన, విశ్వసనీయత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఫ్లెక్స్-ఇంధన స్టేషన్ల విస్తరణ ఇలా..

  • ప్రస్తుత ప్రారంభం : 50 - 100 స్టేషన్లు

  • 2026 చివరి నాటికి : 500 స్టేషన్లు

  • 2027 చివరి నాటికి : 5,000 స్టేషన్లు

రూ.1.84 లక్షల కోట్లు ఆదా!

గడిచిన దశాబ్ద కాలంలో ఇథనాల్ బ్లెండింగ్ (మిశ్రమం) రంగంలో భారత్ ప్రగతి సాధించింది. 2014లో కేవలం 1.5 శాతంగా ఉన్న ఇథనాల్ మిశ్రమం.. నేడు ఏకంగా 20 శాతానికి చేరింది. ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు కంటే ముందే ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. ఈ బ్లెండింగ్ కార్యక్రమం ద్వారా దాదాపు 302 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతులు తగ్గాయి. విదేశీ మారక ద్రవ్యంలో ఏకంగా రూ.1.84 లక్షల కోట్లు ఆదా అయ్యాయి.

సరఫరా గొలుసు ముప్పునకు బ్రేక్

‘భారతదేశం ప్రస్తుతం శిలాజ ఇంధనాల దిగుమతి కోసం ఏటా 120 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. ఇది మన కరెంట్ ఖాతాపై భారాన్ని మోపుతోంది. పైగా మన దేశానికి వచ్చే ఎల్పీజీలో 60 శాతం, ముడి చమురులో 90 శాతం హార్మూజ్‌ జలసంధి గుండానే ప్రయాణించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు స్వచ్ఛమైన ఇథనాల్‌తో (E100) నడిచే వాహనాలను ప్రోత్సహించక తప్పదు’ అని హర్దీప్ సింగ్ పురి అన్నారు.

ఇదీ చదవండి: ‘మనస్ఫూర్తిగా ఒక్కపనీ చేయలేదు’

#

Tags : 1

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)