తయారీపై ‘టారిఫ్‌ల’ ప్రభావం

Published on Tue, 12/02/2025 - 09:00

తయారీ రంగం పనితీరు నవంబర్‌లో కొంత బలహీనపడింది. తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి చేరింది. తయారీ రంగం పనితీరును సూచించే హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తయారీ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) 56.6 పాయింట్లకు పరిమితమైంది. అక్టోబర్‌లో ఇది 59.2 పాయింట్లుగా ఉండడం గమనార్హం. సాధారణంగా 50కు పైన నమోదైతే, విస్తరణగానే పరిగణిస్తుంటారు.

అమెరికా టారిఫ్‌లు తయారీ కార్యకలాపాల విస్తరణను నిదానించేలా చేసినట్టు నవంబర్‌ నెల పీఎంఐ గణాంకాల ఆధారంగా తెలుస్తోందని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా ముఖ్య ఆర్థిక వేత్త ప్రంజుల్‌ భండారీ తెలిపారు. అంతర్జాతీయంగా విక్రయాలు సానుకూలంగా ఉన్నట్టు కంపెనీలు చెబుతున్నప్పటికీ.. ఆఫ్రికా, ఆసియా, యూరప్, మధ్య ప్రాచ్యంలోని క్లయింట్లకు అమ్మకాల్లో వృద్ధి కొంత నిదానించినట్టు చెప్పారు. కొత్త ఎగుమతి ఆర్డర్లు రాక 13 నెలల కనిష్టానికి చేరినట్టు ప్రంజుల్‌ భండారీ తెలిపారు. వ్యాపార విశ్వాసం సైతం నవంబర్‌లో పడిపోయినట్టు చెప్పారు. టారిఫ్‌ల ప్రభావంపై పెరిగిన ఆందోళనలను తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.

జీఎస్‌టీ కోత ఒక్కటీ చాలదు..

‘జీఎస్‌టీ రేట్ల కోత ప్రభావం క్రమంగా ఆవిరవుతోంది. డిమాండ్‌పై టారిఫ్‌ల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇది చాలకపోవచ్చు’ అని భండారీ అభిప్రాయపడ్డారు. నవంబర్‌లో తయారీ వ్యయాలు, విక్రయ ధరలు ఎనిమిది నెలల కనిష్ట స్థాయిలో పెరిగాయి. తగ్గిన ఆర్డర్లకు అనుగుణంగా నియామకాలు, కొనుగోళ్ల ప్రణాళికలను సంస్థలు సవరించుకుంటున్నట్టు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తయారీ రంగ పీఎంఐ సర్వేలో తెలిసింది. నియామకాలు 21 నెలల కనిష్ట స్థాయిలో పెరిగాయి. వచ్చే 12 నెలల కాలానికి తయారీ ఉత్పత్తిని పెంచుకుంటామన్న విశ్వాసం కంపెనీల్లో కనపించడగా, సానుకూల సెంటిమెంట్‌ మాత్రం మూడున్నరేళ్ల కనిష్టానికి పడిపోయింది. 400 తయారీ సంస్థలకు సంబంధించి పర్చేంజింగ్‌ మేనేజర్ల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను హెచ్‌ఎస్‌బీసీ ఇండియా విడుదల చేస్తుంటుంది.

ఇదీ చదవండి: 13 నెలల కనిష్టానికి పారిశ్రామిక వృద్ధి

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)