Breaking News

13 రాష్ట్రాల్లో వీరిదే హవా..! ఆదాయం రూ. కోట్లలోనే..

Published on Mon, 12/11/2023 - 15:35

Sahakar Group Limited (SGL): దేశంలో రోడ్డు వ్యవస్థ మునుపటి కంటే మెరుగుపడింది. హైవేలు, అండర్ పాస్, ఫ్లైఓవర్ వంటి మార్గాలు ఎక్కువయ్యాయి, తద్వారా ప్రయాణం కూడా ఇప్పుడు సులభతరం అయిపోయింది. అయితే ఇప్పుడు ఏ ప్రధాన రహదారి ఎక్కినా ఎక్కడికక్కడ టోల్ ప్లాజాలు ఎదురవుతూనే ఉంటాయి. టోల్ ప్లాజా దాటాలంటే కచ్చితంగా టోల్ పీజు చెలించాల్సి ఉంటుంది. మనదేశంలో ఎక్కువ టోల్ ప్లాజాలు కలిగిన సంస్థ ఏది? దాని ఆదాయం ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతదేశంలో అత్యధిక టోల్ ప్లాజాలు తమ అధీనంలో ఉంచుకున్న అగ్రగామి సంస్థ 'సహకార్ గ్రూప్ లిమిటెడ్' (SGL). దేశవ్యాప్తంగా సుమారు 13 రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకుంటున్న ఈ కంపెనీ 200 కంటే ఎక్కువ టోల్ ప్లాజాలను తమ పరిధిలో ఉంచుకుంది.

1996లో 'కిషోర్ అగర్వాల్' స్థాపించిన సహకార్ గ్రూప్ లిమిటెడ్, అతి తక్కువ కాలంలోనే మంచి పురోగతిని సాధించింది. 2011 - 12 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 30 కోట్లు కాగా.. 2022 - 23 నాటికి రూ. 2700 కోట్లు కంటే ఎక్కువ ఆదాయం పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే టోల్ ప్లాజా రంగంలో ఎంత అభివృద్ధి సాదించించనే విషయం ఇట్టే అర్థమైపోతుంది.

సహకార్ గ్రూప్ లిమిటెడ్ కంపెనీ స్వంత కంప్యూటరైజ్డ్ సిస్టమ్‌లను, స్వంత యాజమాన్య కంప్యూటరైజ్డ్ టోల్ రెవెన్యూ ఆడిటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడంతో సహా టోల్‌లను వసూలు చేయడానికి అప్పటికప్పుడు కొత్త విధానాలు అలవరిస్తోంది.

1996 సమయంలో ఈ  సంస్థ కేవలం ముంబై చుట్టూ ఉన్న మున్సిపల్ కౌన్సిల్‌ల కోసం ఆక్ట్రాయ్ సేకరణతో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తరువాత మహారాష్ట్ర రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్‌లకు క్రమంగా విస్తరించింది. ప్రస్తుతం దేశంలో ఎక్కువ టోల్ ప్లాజాలు కలిగిన సంస్థగా అవతరించింది.

ఇదీ చదవండి: మరింత తగ్గిన బంగారం, వెండి - నేటి కొత్త ధరలు ఇవే..

సహకార్ గ్రూప్ లిమిటెడ్ సంస్థలో సుమారు 4000 కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతే కాకుండా టోల్ ప్లాజాల సంఖ్య కూడా తప్పకుండా పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)