సిటీలో పెరిగిన నిరుద్యోగ రేటు

Published on Wed, 07/16/2025 - 13:31

జూన్‌లో నిరుద్యోగిత (నిరుద్యోగం రేటు) ఫ్లాట్‌గా నమోదైంది. ఈ ఏడాది మే నెలలో మాదిరే జూన్‌లోనూ 5.6 శాతం వద్దే (అన్ని వయసుల వారికి సంబంధించి) కొనసాగింది. ఏప్రిల్‌లో ఉన్న 5.1 శాతం కంటే కొంచెం ఎక్కువ. కానీ, పట్టణాల్లో నిరుద్యోగ రేటు వరుసగా మూడో నెలలోనూ పెరిగింది. జూన్‌లో 7.1 శాతంగా నమోదైంది. ఈ మేరకు పీరియాడిక్‌ లేబర్‌ఫోర్స్‌ సర్వే వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. పనిచేయగల అర్హతలు ఉండీ, పనిదొరక్క ఖాళీగా ఉన్న వారి గురించి ఈ గణాంకాలు తెలియజేస్తాయి.  

ఇదీ చదవండి: గగనతలంలో గస్తీకాసే రారాజులు

  • పట్టణాల్లో అన్ని వయసుల వారికి సంబంధించిన నిరుద్యోగ రేటు 7.1 శాతానికి చేరింది. మేలో 6.9 శాతం, ఏప్రిల్‌లో 6.5 శాతం చొప్పున ఉండడం గమనార్హం.  

  • పట్టణాల్లో 15.29 సంవత్సరాల వారిలో నిరుద్యోగ రేటు జూన్‌లో 18.8 శాతానికి పెరిగింది. మే నెలలో ఇది 17.9 శాతంగా ఉంటే, ఏప్రిల్‌లోనూ 17.2 శాతంగా ఉంది.  

  • దేశవ్యాప్తంగా మహిళలకు సంబంధించి నిరుద్యోగ రేటు జూన్‌లో 5.6 శాతానికి తగ్గింది. మేలో ఇది 5.8 శాతంగా ఉంది.  

  • 15–29 ఏళ్ల వయసు వారిలో నిరుద్యోగిత మే నెలలో 15 శాతంగా ఉంటే, జూన్‌లో 15.3 శాతానికి పెరిగింది.  

  • కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (15 ఏళ్లకు మించిన వారిలో) మే నెలలో ఉన్న 54.8 శాతం నుంచి జూన్‌లో 54.2 శాతానికి పరిమితమైంది. గ్రామీణ ప్రాంతాల్లో 56.1 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50.4 శాతం చొప్పున జూన్‌లో నమోదైంది.

  • పురుష కార్మికుల భాగస్వామ్య రేటు గ్రామీణ ప్రాంతాల్లో 78.1 శాతం, పట్టణాల్లో 75 శాతం చొప్పున ఉంది. మే నెలతో పోల్చి చూస్తే స్వల్పంగా తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు జూన్‌లో 35.2 శాతానికి తగ్గింది.

  • గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ, పురుషుల నిరుద్యోగ రేటు పెరగడానికి.. సొంత పనులపై ఆధారపడడం వల్లేనని ఈ సర్వే నివేదిక తెలిపింది.
     

Videos

నచ్చకపోతే వెళ్లిపోండి జపాన్ క్రికెట్ CEO బీసీసీఐకి షాక్

ఇచ్చి ఒక నెల కూడా కాలేదు లోకేష్ ని ఏకిపారేసిన శ్రీదేవి

చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం

డబ్బు కోసం స్నేహితుడినే కిడ్నాప్.. పట్టించిన వాట్సాప్ మెసేజ్

అమెరికా పునాదులు కదిలిస్తాం?

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

దులీప్ ట్రోపి ఫైనల్ నుండి వైభవ్ అవుట్?

నన్ను టార్గెట్ చేస్తే.. ఎమ్మెల్యేలకు కొండా హెచ్చరిక

Garam Garam : బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు

విజయవాడలో హైటెన్షన్ విద్యా భవన్ ముట్టడి

Photos

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)