ఇజ్రాయెలీ ఇన్వెస్టర్లకు నిబంధనల సడలింపు

Published on Tue, 09/09/2025 - 14:52

న్యూఢిల్లీ: ఇజ్రాయెలీ ఇన్వెస్టర్లకు సంబంధించి ‘లోకల్‌ రెమెడీస్‌ ఎగ్జాషన్‌’ నిబంధన వ్యవధిని అయిదేళ్ల నుంచి ప్రస్తుతం మూడేళ్లకు కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇజ్రాయెల్‌తో ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం (బీఐఏ) కుదుర్చుకుంది. ఈ నిబంధన ప్రకారం, వివాదాలేవైనా తలెత్తితే విదేశీ ఇన్వెస్టర్లు ముందుగా ఆతిథ్య దేశంలోని న్యాయ వ్యవస్థ ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాతే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కి వెళ్లాలి.

సాధారణంగా భారత్‌ ఇందుకోసం అయిదేళ్ళ వ్యవధిని నిర్దేశిస్తోంది. తాజాగా కుదుర్చుకున్న బీఐఏలో గతానికి భిన్నంగా పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను కూడా చేర్చారు. యూఏఈతో భారత్‌ కుదుర్చుకున్న బీఐఏ తరహాలోనే ఇజ్రాయెల్‌ బీఏఐ కూడా ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు. భారత్‌ ఈ డీల్‌ కుదుర్చుకున్న తొలి ఓఈసీడీ (ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కో–ఆపరేషన్, డెవలప్‌మెంట్‌) కూటమి దేశం ఇజ్రాయెల్‌ కావడం గమనార్హం.

ఇటు భారత సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లకుండా అటు ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఈ ఒప్పందం ఉంటుంది. 2000 ఏప్రిల్‌ నుంచి 2025 జూన్‌ వరకు ఇజ్రాయెల్‌ నుంచి భారత్‌కి 337.77 మిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయి. 

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)