Breaking News

ఐపీవోకు సిద్ధమవుతున్న ప్రముఖ కంపెనీలు

Published on Sun, 05/04/2025 - 13:05

ఐపీవోకు ప్రయారిటీ జ్యువెల్స్‌

ఆభరణాల రిటైల్‌ కంపెనీ ప్రయారిటీ జ్యువెల్స్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 54 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఈ నిధుల్లో రూ. 75 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచి్చంచనుంది. 2007లో ఏర్పాటైన కంపెనీ బంగారం, ప్లాటినం, వెండిసహా వజ్రాలతోకూడిన ఆభరణాలను తయారు చేసి విక్రయిస్తోంది. క్యారట్‌లేన్, కళ్యాణ్‌ జ్యువెలర్స్, మలబార్‌ గోల్డ్, రిలయన్స్‌ రిటైల్, టీబీజెడ్, సెన్‌కో గోల్డ్‌ తదితర జ్యువెలరీ రిటైల్‌ స్టోర్లకు సైతం ప్రొడక్టులు సరఫరా చేస్తోంది.  


ఎన్‌ఎస్‌ఈ ఐపీవోపై సెబీతో చర్చలు

పబ్లిక్‌ ఇష్యూ బాటలో సాగుతున్న స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో చర్చలు నిర్వహిస్తోంది. కొన్ని కీలక అంశాల పరిష్కారం కోసం ఎన్‌ఎస్‌ఈ, సెబీ మధ్య చర్చలు కొనసాగుతున్న­ట్లు సెబీ చీఫ్‌ తుహిన్‌ కాంత పాండే తాజాగా వెల్లడించారు. కీలక యాజమాన్య వ్యక్తులకు చె­ల్లింపులు, టెక్నాలజీ, క్లియరింగ్‌ కార్పొరేషన్‌లో మెజారిటీ ఓనర్‌షిప్‌ తదితర అంశాలపై సెబీ ఎన్‌ఎస్‌ఈతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఈ ఐపీవో చేపట్టేందుకు వీలుగా ఎన్‌వోసీ కోసం సెబీకి దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 50 ఏళ్లు వచ్చే బ్యాటరీ


కొరోనా రెమిడీస్‌ ఐపీవో

ఫార్మా రంగ కంపెనీ కొరోనా రెమిడీస్‌ ఐపీవో బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. వీటి ప్రకారం కంపెనీ రూ. 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 800 కోట్లు సమీకరించనున్నప్పటికీ నిధు­లు కంపెనీకి లభించబోవు. మహిళా ఆరోగ్య పరిరక్షణ, కార్డియో– డయాబెటో, పెయిన్‌ మేనేజ్‌మెంట్, యూరాలజీ తదితర విభాగాలలో కంపెనీ ప్రొడక్టులు రూపొందిస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)