Breaking News

వియత్నాం స్టీల్‌పై యాంటీ డంపింగ్‌!

Published on Sat, 08/17/2024 - 05:08

న్యూఢిల్లీ: హాట్‌ రోల్డ్‌ స్టీల్‌ ఉత్పత్తులను వియత్నాం నుండి దిగుమతి చేసుకోవడంపై యాంటీ డంపింగ్‌ విచారణను భారత్‌ ప్రారంభించింది. హాట్‌ రోల్డ్‌ ఫ్లాట్‌ అల్లాయ్‌ లేదా నాన్‌–అల్లాయ్‌ స్టీల్‌ డంపింగ్‌ ఆరోపణలపై వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన దర్యాప్తు విభాగం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ రెమెడీస్‌ (డీజీటీఆర్‌) ఈ విచారణ జరుపుతోంది. 

డీజీటీఆర్‌ నోటిఫికేషన్‌ ప్రకారం వియత్నాం నుండి దిగుమతులపై యాంటీ డంపింగ్‌ విచారణను ప్రారంభించాలని కోరుతూ దేశీయ ఉత్పత్తిదారులైన జేఎస్‌డబ్లు్య స్టీల్‌ లిమిటెడ్, ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ తరపున ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్‌ ఒక దరఖాస్తును దాఖలు చేసింది. దేశీయంగా తయారీ కంటే తక్కువ ధరలకు ఉత్పత్తిని దిగుమతి చేసుకుంటున్నారని.. ఇది దేశీయ పరిశ్రమకు వస్తుపరమైన హాని కలిగిస్తోందని దరఖాస్తుదారులు ఆరోపించారు. 

అలాగే దేశీయ పరిశ్రమకు మరింత నష్టం వాటిల్లుతుందని, యాంటీ డంపింగ్‌ డ్యూటీని విధించాలని అభ్యర్థించారు. దేశీయ కంపెనీలకు ఈ డంపింగ్‌ కారణంగా నష్టం కలిగిందని నిర్ధారణ అయితే దిగుమతులపై యాంటీ డంపింగ్‌ సుంకాన్ని విధించాలని డీజీటీఆర్‌ సిఫార్సు చేస్తుంది. సుంకాలు విధించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది. చౌక దిగుమతులు పెరగడం వల్ల దేశీయ పరిశ్రమలు దెబ్బతిన్నాయో లేదో తెలుసుకోవడానికి వివిధ దేశాలు యాంటీ డంపింగ్‌ విచారణ నిర్వహిస్తాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)