Breaking News

ఓపెన్‌ ఏఐకి భారత్‌ కీలక మార్కెట్‌ 

Published on Thu, 02/06/2025 - 05:26

న్యూఢిల్లీ: కృత్రిమ మేధలో సంచలనం సృష్టించిన తమ చాట్‌జీపీటీకి భారత్‌ రెండో అతి పెద్ద మార్కెట్‌గా మారిందని ఓపెన్‌ఏఐ సంస్థ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ తెలిపారు. దేశీయంగా చాట్‌జీపీటీని ఉపయోగించే యూజర్ల సంఖ్య గతేడాది మూడు రెట్లు పెరిగినట్లు ఆయన చెప్పారు. ఏఐ విప్లవానికి సారథ్యం వహించే దేశాల్లో భారత్‌ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి వ్యయాలు ఏడాది తర్వాత దాదాపు పది రెట్లు తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పారు. దేశీయంగా టెక్నాలజీ రంగం అసాధారణంగా పురోగమిస్తోందని తెలిపారు. 

భారత పర్యటనలో భాగంగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆల్ట్‌మన్‌ ఈ విషయాలు తెలిపారు. పేటీఎం వ్యవస్థాపక సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ, స్నాప్‌డీల్‌ సహ వ్యవస్థాపకుడు కునాల్‌ బెహల్, అన్‌అకాడెమీ సీఈవో గౌరవ్‌ ముంజాల్‌ తదితర పరిశ్రమ దిగ్గజాలతో కూడా ఆయన సమావేశమయ్యారు. చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌లాంటి కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను ఉపయోగించొద్దంటూ కేంద్ర ఆర్థిక శాఖ తమ అధికారులను ఆదేశించిన తరుణంలో ఆల్ట్‌మన్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆల్ట్‌మన్‌కి వైష్ణవ్‌ కౌంటర్‌

చాట్‌జీపీటీలాంటి ఫౌండేషనల్‌ మోడల్‌ను రూపొందించే సామర్థ్యాల విషయంలో భారత్‌పై అసలు ఆశలే లేవంటూ రెండేళ్ల క్రితం పర్యటనలో వ్యాఖ్యానించిన ఆల్ట్‌మన్‌కి తాజాగా మంత్రి వైష్ణవ్‌ కౌంటర్‌ ఇచ్చారు. చంద్రుడి మీదకు అత్యంత చౌకగా చంద్రయాన్‌–3 మిషన్‌ను అమలు చేసిన భారత్‌కి.. అత్యంత తక్కువ ఖర్చులోనే ఏఐని కూడా రూపొందించే సామర్థ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.  సొంతంగా చిప్‌సెట్లను తయారు చేసుకోవడం, అత్యంత చౌకగా కంప్యూటింగ్‌ సామర్థ్యాలను అందించడం నుంచి ప్రాంతీయ భాషలు, సంస్కృతులకు అనుగుణంగా మోడల్స్‌కి శిక్షణనిచ్చే డేటా సెట్లను రూపొందించే వరకు ఏఐ సంబంధిత పూర్తి వ్యవస్థను తీర్చిదిద్దడంపై భారత్‌ కసరత్తు చేస్తోందని తెలిపారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)