Breaking News

స్టీల్‌ దిగుమతులపై సుంకాలు 

Published on Thu, 01/01/2026 - 04:14

న్యూఢిల్లీ: కొన్ని రకాల స్టీల్‌ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను మూడేళ్ల కాలానికి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. చైనా తదితర దేశాల నుంచి చౌకగా వస్తున్న స్టీల్‌ ఉత్పత్తుల నుంచి దేశీ పరిశ్రమను కాపాడుకునేందుకు ఈ చర్య తీసుకుంది. 2025 ఏప్రిల్‌ నుంచి స్టీల్‌ ఉత్పత్తుల దిగుమతులపై 12 శాతం సుంకాన్ని 200 రోజుల పాటు అమల్లో ఉండేలా కేంద్రం ఆదేశాలు తీసుకొచ్చింది. ఇప్పుడు 2028 ఏప్రిల్‌ వరకు వీటిని పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం తన నోటిఫికేషన్‌లో ప్రకటించింది. 

మొదటి ఏడాది కాలం అంటే 2026 ఏప్రిల్‌ 20 వరకు 12 శాతం, తదుపరి ఏడాది పాటు 11.5 శాతం, మూడో ఏడాది 11 శాతం చొప్పున 2028 ఏప్రిల్‌ 20 వరకు సంకాలు అమలు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం చర్య దేశీ స్టీల్‌ పరిశ్రమలో స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే, వినియోగదారులు, ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు నిరంతర సరఫరా కొనసాగించేందుకు ఉద్దేశించినదని ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఏ) ప్రెసిడెంట్‌ నవీన్‌ జిందాల్‌ (జిందాల్‌ స్టీల్‌ చైర్మన్‌) తెలిపారు. చైనా, జపాన్, కొరియా, వియత్నాంలో మిగులు స్టీల్‌ ఉత్పాదకతను భారత మార్కెట్‌వైపు మళ్లించడం వల్ల దేశీ సామర్థ్య వినియోగానికి సమస్యలు ఏర్పడుతున్నట్టు, పెట్టుబడుల ప్రణాళిక, ఉపాధిపై ప్రభావం చూపిస్తున్నట్టు చెప్పారు.   

Videos

అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?

నేను నిప్పు, తెరిచిన పుస్తకం అన్నావ్ గా.. మరీ ఈ సీక్రెట్ టూర్ లు ఏంటి?

ఫ్రెండ్స్ తో పందెం కట్టి.. పెన్ను మింగేశాడు

ఈ వయసులో నీకు బుద్ధి లేదా.. MLA బుచ్చయ్య చౌదరిపై రెచ్చిపోయిన చెల్లుబోయిన

స్విట్జర్లాండ్ లో పెను విషాదం.. 40 మంది మృతి ..100 మందికి గాయాలు

చంద్రబాబు మీద ఉన్న ప్రతి కేసు రీ ఓపెన్!

బుజ్జితల్లి టాలీవుడ్ కు వచ్చేస్తుందా..

ప్రేమపెళ్లి చేసుకున్న యువకుడిపై దాడి

800 KG కేక్ కట్టింగ్.. జగన్ ఆశీస్సులతో మనదే విజయం

జగన్ వార్నింగ్ తో చంద్రబాబు సెల్ఫ్ గోల్..

Photos

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

లంగా ఓణీలో 'ఈషా రెబ్బా'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హైటెక్ సిటీలో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)