Breaking News

రష్యా చమురు దిగుమతులు జూమ్‌

Published on Wed, 06/04/2025 - 04:33

న్యూఢిల్లీ: దేశీయంగా రష్యా నుంచి ముడిచమురు దిగుమతులు గత నెలలో భారీగా పెరిగాయి. వెరసి మే నెలలో రోజుకి 1.96 మిలియన్‌ బ్యారళ్ల(బీపీడీ)ను తాకాయి. ఇది 10 నెలల గరిష్టంకాగా.. ప్రపంచ ప్రామాణిక ధరలకంటే తక్కువలో చమురు లభించడం ఇందుకు సహకరించినట్లు గణాంకాల సంస్థ కెప్లర్‌ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం, దిగుమతులకు మూడో ర్యాంకులో నిలిచే భారత్‌ విదేశాల నుంచి 5.1 మిలియన్‌ బ్యారళ్ల చమురును కొనుగోలు చేసింది. ముడిచమురును శుద్ధి చేయడం ద్వారా రిఫైనరీలు పెట్రోల్, డీజిల్‌ తదితర ఇంధనాల తయారీని చేపట్టే సంగతి తెలిసిందే.

భారత్‌ కొనుగోలు చేసిన చమురులో రష్యా 38 శాతం వాటా ఆక్రమిస్తోంది. రోజుకి 1.2 మిలియన్‌ బ్యారళ్ల సరఫరా ద్వారా ఇరాక్‌ రెండో పెద్ద సరఫరాదారుగా నిలిచింది. ఈ బాటలో భారత్‌కు 6,15,000 బీపీడీ చమురును సౌదీ అరేబియా ఎగుమతి చేయగా.. యూఏఈ 14,90,000 బీపీడీ అందించింది. యూఎస్‌ నుంచి 2,80,000 బీపీడీ చమురును అందుకుంది.  గత నెలలో భారత్‌ చమురు దిగుమతుల ప్రొఫైల్‌ ధరల ఆధారంగా విభిన్న ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లు కెప్లర్‌ వివరించింది. నిజానికి మధ్యప్రాచ్యం నుంచి భారత్‌ అత్యధికంగా చమురును కొనుగోలు చేస్తుంటుంది.

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)