Breaking News

ఐఐపీ లెక్కల్లో భారీ మార్పులు

Published on Wed, 05/27/2026 - 09:59

దేశ పారిశ్రామిక వృద్ధి రేటును అంచనా వేసే ‘పారిశ్రామిక ఉత్పత్తి సూచీ’ (ఐఐపీ-ఇండెక్స్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌) లెక్కింపు పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. మారుతున్న ఆర్థిక ముఖచిత్రానికి అనుగుణంగా మరింత పారదర్శకంగా పారిశ్రామిక ప్రగతిని ప్రతిబింబించేలా ఐఐపీ పరిధిని విస్తరిస్తోంది. ‘బేస్ ఇయర్ రివిజన్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ’ (టీఏసీ-ఐఐపీ) చేసిన ప్రతిపాదనల మేరకు సరికొత్త ఐఐపీ సిరీస్‌ను జూన్ 1వ తేదీన ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనుంది.

ఈ కొత్త సిరీస్‌లో ఇప్పటివరకు ఉన్న బేస్ ఇయర్ 2011-12 స్థానంలో 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని నూతన ఆధారిత సంవత్సరంగా (బేస్‌ ఇయర్‌) ఖరారు చేశారు. ఇటీవల మార్చిన దేశ జీడీపీ బేస్‌ ఇయర్‌ 2022-23, వినియోగదారుల ధరల సూచీ - సీపీఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం బేస్‌ ఇయర్‌ 2024ల తర్వాత వాస్తవిక ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించేలా మారుస్తున్న మూడో కీలక ఆర్థిక సూచిక ఇదే కావడం గమనార్హం.

కొత్తగా చేరిన రంగాలు

గణాంకాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. పారిశ్రామిక రంగంలో వస్తున్న నూతన మార్పులను అందిపుచ్చుకునేలా ఐఐపీ పరిధిని పెంచారు. అరుదైన ఖనిజాల విభాగంలో మైనింగ్, క్వారీయింగ్ విభాగం కింద రేర్‌ ఎర్త్‌ మెటల్స్‌, మైనర్ మినరల్స్‌ను కొత్తగా ఈ సూచీలో చేర్చారు. అంతేకాకుండా, సాంప్రదాయ (నాన్‌ రెన్యువబుల్‌), పునరుత్పాదక (రెన్యువబుల్‌) ఇంధన వనరుల ద్వారా జరిగే విద్యుత్ ఉత్పాదనను ఇకపై విడివిడిగా చూపిస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నల్లా కనెక్షన్ల సంఖ్య ఆధారంగా నీటి సరఫరా విభాగాన్ని అంచనా వేస్తారు. అమృత్ పథకం కింద ఉన్న 500 నగరాల్లోని డ్రైనేజీ కనెక్షన్ల ఆధారంగా మురుగునీటి నిర్వహణను, పట్టణాల్లో సేకరించి ప్రాసెస్ చేసిన వ్యర్థాల ఆధారంగా వేస్ట్ మేనేజ్‌మెంట్ రంగాన్ని ట్రాక్ చేస్తారు.

ఆరు విభాగాల వర్గీకరణ యథాతథం

బేస్ ఇయర్‌ మారినప్పటికీ.. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరు రకాల వర్గీకరణలను కమిటీ యథాతథంగా కొనసాగించింది. ఇందులో ప్రాథమిక వస్తువులు, మూలధన వస్తువులు, మధ్యంతర వస్తువులు, మౌలిక సదుపాయాలు-నిర్మాణ రంగ వస్తువులు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, కన్స్యూమర్ నాన్-డ్యూరబుల్స్ ఉన్నాయి.

జూన్ 1న తొలి నివేదిక

జూన్ 1న విడుదలయ్యే తొలి నివేదికలో ఏప్రిల్ 2023 నుంచి గణాంకాలను పొందుపరుస్తారు. ఇందులో ఏప్రిల్ 2026కి సంబంధించిన ముందస్తు అంచనాలు కూడా ఉంటాయి. ఆల్ ఇండియా జనరల్ ఇండెక్స్‌తో పాటు.. మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ సప్లై, వాటర్ సప్లై, వేస్ట్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల వారీ సూచీలను కూడా ప్రత్యేకంగా విడుదల చేయనున్నారు. ఈ నూతన సంస్కరణల ద్వారా దేశ పారిశ్రామిక రంగానికి సంబంధించిన మరింత స్పష్టమైన, వాస్తవిక లెక్కలు అందుబాటులోకి వస్తాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు

Videos

హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను

ఆకాశం నుంచి నిప్పుల వాన

నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..?

బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్

సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు

పినరయి విజయన్ నివాసం వద్ద ED టీం పై CPM దాడి

రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జోసెఫ్ విజయ్

పోలీస్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన సాక్షి రిపోర్టర్

భారత కంపెనీల లాభాలకు రిస్క్ ఆందోళనలో పారిశ్రామికవేత్తలు

ప్రతి ఇంట్లో బాబు వెన్నుపోటు పాలనపె చర్చ జరగాలి

Photos

+5

వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

ఈ బుక్‌లెట్‌ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

మోహినీ రూపంలో అవతారంలో శ్రీగోవిందరాజస్వామి (ఫొటోలు)

+5

హీరో ఉపేంద్ర ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

చిట్టి గౌనులో నజ్రియా క్యూట్‌ లుక్స్‌(ఫోటోలు)

+5

మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్

+5

విశాఖపట్నంలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

సొంత ఊరు జాతరలో స్టెప్పులు వేసిన దేవిశ్రీ ప్రసాద్ (ఫొటోలు)

+5

ఎలిమినేట‌ర్ పోరు.. నితీశ్ రెడ్డి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌ (ఫొటోలు)