Breaking News

పెట్టుబడులకు కేంద్రంగా భారత్: పీయూష్ గోయల్

Published on Mon, 09/23/2024 - 15:02

వికసిత భారత్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తూ.. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలను ఏర్పరచుకుంటోంది. ఈ తరుణంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి 'పీయూష్ గోయల్' సిడ్నీలో పారిశ్రామిక ప్రముఖులు & ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో భారత్.. ఆస్ట్రేలియా మధ్య పెరుగుతున్న ఆర్థిక సంబంధాలను గురించి ప్రస్తావించారు.

భారత్ - ఆస్ట్రేలియా భాగస్వామ్య ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ.. ఇరు పక్షాల మధ్య సహకారం, భవిష్యత్ అవకాశాల గురించి చర్చించడం ఆనందంగా ఉందని గోయల్ అన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించాలని ఆయన అన్నారు.

గోయల్ తన పర్యటనలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని ప్రముఖ డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎయిర్‌ట్రంక్ వ్యవస్థాపకుడు, సీఈఓ 'రాబిన్ ఖుదా'తో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇండియాలో డిజిటలైజేషన్ వృద్ధి గురించి మాత్రమే కాకుండా.. భారత్ ఆస్ట్రేలియా మధ్య డేటా మౌలిక సదుపాయాల రంగంలో సహకారం కోసం గణనీయమైన సంభావ్యత గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.

ఇదీ చదవండి: భారత్ వృద్ధికి కీలక చర్చలు: పీయూష్ గోయల్

భారత్ డిజిటలైజేషన్‌లో వేగంగా పురోగమిస్తోంది. కాబట్టి డేటా సెంటర్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్, టెక్నాలజీతో నడిచే మౌలిక సదుపాయాల వంటి వాటి పెట్టుబడులకు దేశం కేంద్రంగా మారింది. ఇండియా గ్లోబల్ డిజిటల్ హబ్‌గా మారాలంటే.. టెక్ రంగంలో జాయింట్ వెంచర్లు, భాగస్వామ్యాల సంభావ్యత చాలా అవసరమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)