Breaking News

డిసెంబర్‌లో నియామకాల జోరు

Published on Fri, 01/24/2025 - 04:52

హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా నియామకాలు డిసెంబర్‌లో జోరందుకున్నాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 31 శాతం పెరిగినట్టు ఫౌండిట్‌ ఇన్‌సైట్స్‌ ట్రాకర్‌ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం గడిచిన ఆరు నెలల్లో నియామకాలు 12 శాతం పెరిగాయి. ఆన్‌లైన్‌ జాబ్‌ పోస్టింగ్‌ల ద్వారా ఈ వివరాలను ఫౌండిట్‌ వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో డిసెంబర్‌ నెలలో నియామకాలు 36 శాతం పెరిగాయి.   

→ కన్జ్యూమర్‌ ఎల్రక్టానిక్స్, తయారీ, నిర్మాణం, ఇంజనీరింగ్‌ రంగాల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. 57 శాతం నుంచి 60 శాతం వరకు ఈ రంగాల్లో నియామకాలు డిసెంబర్‌లో పెరిగాయి.  
→ ఏఐ ఉద్యోగాలు గడిచిన రెండేళ్లలో 42 శాతం వృద్ధితో 2,53,000కు చేరాయి. పైథాన్, ఏఐ/ఎంఎల్, డేటా సైన్స్, డీప్‌ లెరి్నంగ్, ఎస్‌క్యూఎల్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యాలకు ఎక్కువ డిమాండ్‌ నెలకొంది. టెన్సార్‌ఫ్లో, పైటార్చ్‌ తదితర ఏఐ ఫ్రేమ్‌వర్క్‌ల్లో నైపుణ్యాలున్న వారికి సైతం అధిక డిమాండ్‌ కనిపించింది. 
→ హెచ్‌ఆర్‌ అడ్మిన్‌ ఉద్యోగ నియామకాలు గత మూడు నెలల్లో 21 శాతం పెరిగాయి.  
→ మెడికల్‌ ఉద్యోగాలు సైతం 44 శాతం అధికంగా నమోదయ్యాయి. టెలీ మెడిసిన్, డయాగ్నోస్టిక్స్, నర్సింగ్, హెల్త్‌కేర్‌ అనలిస్ట్‌ తదితర హెల్త్‌టెక్‌ ఉద్యోగాలకు డిమాండ్‌ నెలకొంది. 
→ డిసెంబర్‌లో కోయింబత్తూరులో అత్యధికంగా 58 శాతం మేర నియామకాలు పెరిగాయి. బెంగళూరులో 41 శాతం, చెన్నైలో 37 శాతం చొప్పున అధిక నియామకాలు జరిగాయి. ముంబైలో 23 శాతం, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 33 శాతం చొప్పున అధిక నియామకాలు చోటుచేసుకున్నాయి. 
→ టైర్‌–2, 3 నగరాలు హెల్త్‌కేర్‌ కేంద్రాలకు నిలయాలుగా మారుతున్నాయి. వీటికి సంబంధించి నియామకాలు 30 శాతం పెరిగాయి.  
→ బెంగళూరులో 26 శాతం, పుణెలో 17 శాతం, ఢిల్లీలో 14 శాతం చొప్పున ఏఐ నియామకాలు వృద్ధి చెందాయి. 

ఏఐ కీలకం.. 
‘‘అన్ని రంగాల్లోనూ నియామకాలు పెరగడం ఉద్యోగ మార్కెట్‌ చురుకుదనాన్ని, బలాన్ని తెలియజేస్తోంది. ముఖ్యంగా గత రెండేళ్లలో ఏఐ ఉద్యోగాల్లో 42 శాతం పెరగడం గమనార్హం. 2025లోనూ ఏఐ ఉద్యోగ నియామకాల్లో 14 శాతం మేర వృద్ది ఉండొచ్చు. ఏఐ ఇకపై ప్రస్తుత, భవిష్యత్‌ మానవ వనరులకు కీలకంగా కొనసాగుతుంది’’అని ఫౌండిట్‌ సీఈవో వి.సురేష్‌ అన్నారు.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)