Breaking News

గిగ్‌ వర్కర్లు @ 2.1 కోట్లు!

Published on Sat, 07/18/2026 - 06:29

న్యూఢిల్లీ: దేశంలో మొబైల్‌ యాప్‌ల ఆధారిత సేవల్లో పనిచేసే గిగ్‌ శ్రామిక శక్తి రాబోయే రోజుల్లో భారీగా పెరగనుంది. ప్రస్తుతం సుమారు 60 లక్షలుగా ఉన్న గిగ్‌ వర్కర్ల సంఖ్య 2030 నాటికి దాదాపు మూడు రెట్లు పెరిగి 1.7 కోట్ల నుంచి 2.1 కోట్లకు (17–21 మిలియన్లు) చేరుకునే అవకాశముందని రెడ్‌సీర్‌ స్ట్రాటజీ కన్సల్టెంట్స్‌ గురువారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 

‘భారతదేశంలో గిగ్‌ ఇంటర్నెట్‌ వర్క్‌ఫోర్స్‌: దాదాపు 2 కోట్ల జీవనోపాధికి వారధి’ పేరుతో విడుదలైన ఈ నివేదిక ప్రకారం.. డెలివరీ, రైడ్‌–హెయిలింగ్‌ (ఓలా, ఉబెర్‌), హోమ్‌ సరీ్వసెస్‌ వంటి గిగ్‌ ప్లాట్‌ఫారమ్‌లు కేవలం సౌకర్యవంతమైన ఉపాధి అవకాశాలకే పరిమితం కాకుండా, దేశంలో జీవనోపాధి కల్పించే ప్రధాన వనరులుగా ఎదుగుతున్నాయి. సర్వేలో పాల్గొన్న కారి్మకుల్లో 54 శాతం మంది గిగ్‌ ప్లాట్‌ఫారమ్‌లలో చేరకముందు ఎలాంటి వేతన ఉపాధిలోనూ లేరని నివేదిక పేర్కొంది. అలాగే, 2030 నాటికి గిగ్‌ రంగంలోకి రానున్న కారి్మకుల్లో 30 శాతానికి పైగా మంది మొదటిసారిగా శ్రామిక రంగంలో అడుగుపెట్టే వారే ఉంటారని నివేదిక స్పష్టం చేసింది. 

ఈ నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు 
→ ఇతర సాంప్రదాయ ప్రభుత్వ, ప్రైవేట్‌ (ఫార్మల్‌) ఉద్యోగాలు, అసంఘటిత రంగంలోని ఉపాధితో పోలిస్తే.. గిగ్‌ రంగంలో పూర్తి సమయం పనిచేసే కార్మికులు నెలకు 2.5 రెట్లు అధిక నికర ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. 
→ గిగ్‌ ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేసిన అనుభవం భవిష్యత్తులో తమ ఆదాయ అవకాశాలను మెరుగుపరుస్తుందని దాదాపు 70 శాతం మంది కారి్మకులు విశ్వసిస్తున్నారు. 
→ నెలవారీగా యాక్టివ్‌గా పనిచేసే గిగ్‌ వర్కర్లలో 90 శాతానికి పైగా మంది పార్ట్‌టైమ్‌ పనినే ఎంచుకుంటున్నారు. ఇది ఈ రంగంలో ఉన్న పని వేళల వెసులుబాటును (ఫ్లెక్సిబిలిటీ) ప్రతిబింబిస్తోంది. 
→ గిగ్‌ రంగంలో తదుపరి దశ వృద్ధికి మహిళల భాగస్వామ్యాన్ని విస్తరించడం ఒక అతిపెద్ద అవకాశంగా నివేదిక పేర్కొంది.


‘‘భారత గిగ్‌ ఇంటర్నెట్‌ వర్క్‌ఫోర్స్‌ ప్రత్యేకత ప్రజలకు అందించే అవకాశాలు, ఎంపికల్లోనే ఉంది. సాంప్రదాయ ఉద్యోగ వ్యవస్థల పరిమితులు లేకుండా శ్రామిక రంగంలోకి ప్రవేశించేందుకు, కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడానికి, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి ఇది ఒక ఆచరణాత్మక మార్గాన్ని అందిస్తోంది’’ అని రెడ్‌సీర్‌ స్ట్రాటజీ కన్సల్టెంట్స్‌ పార్ట్నర్‌ కుశాల్‌ భటా్నగర్‌ తెలిపారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)