Breaking News

ఆర్‌బీఐ వార్షిక నివేదిక: భారత్ జీడీపీ వృద్ధి ఇలా..

Published on Thu, 05/29/2025 - 16:18

భారత్ ఇటీవలే జపాన్‌ను అధిగమించి.. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇక మన ముందు ఉన్న లక్ష్యం జర్మనీని అధిగమించడమే. ఈ తరుణంలో 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) వచ్చే ఆర్ధిక సంవత్సరంలో దేశ ఆర్ధిక వ్యవస్థ ఎలా ఉంటుందనే విషయాన్ని'2024-2025 వార్షిక నివేదిక'లో వెల్లడించింది.

2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. అంతే కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థ.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని.. తద్వారా స్థిరమైన వృద్ధి సాధ్యమవుతుందని నివేదికలో వెల్లడించింది.

మార్కెట్ అస్థిరతలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య విచ్ఛిన్నం, సరఫరా గొలుసుల అంతరాయాలు, వాతావరణ ప్రేరిత అనిశ్చితులు మొదలైనవన్నీ ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్‌బీఐ పేర్కొంది. అయితే ఆర్థిక ఏకీకరణ మార్గంలో ప్రభుత్వం నిరంతరం మూలధనంపై దృష్టి పెట్టడం, వినియోగదారులు & వ్యాపార ఆశావాదాన్ని బలోపేతం చేయడం, బలమైన స్థూల ఆర్థిక ప్రాథమిక అంశాలన్నీ సజావుగా ముందుకు సాగితే.. 2025-26లో భారత ఆర్థిక వ్యవస్థ దృక్పథం ఆశాజనకంగానే ఉందని స్పష్టం చేసింది.

2025-26లో వ్యవసాయ రంగానికి అవకాశాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం మాత్రమే కాకుండా.. ఉత్పాదకతను పెంచే ప్రభుత్వ విధానాలు కూడా అని ఆర్‌బీఐ పేర్కొంది. 2025-26 కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి వివిధ కొత్త చొరవలను ప్రకటించారని కూడా వెల్లడించింది.

ఇదీ చదవండి: ఇక భారత్ టార్గెట్ జర్మనీ: 2027 నాటికి..

టారిఫ్ విధానాలలో మార్పులు ఆర్థిక మార్కెట్లలో అప్పుడప్పుడు అస్థిరతలకు దారితీయవచ్చు. అయితే ఈ ఏడాది కేంద్ర బడ్జెట్​లో ప్రకటించిన నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ మిషన్.. మేక్ ఇన్ ఇండియా వంటివి తయారీ రంగాన్ని మరింత బలపరుస్తాయి. తద్వారా.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

భారత్ ఇప్పటికే అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఇందులో యూఎస్ఏ మాత్రమే కాకుండా.. ఒమన్, పెరూ, ఈయూ మొదలైన దేశాలు ఉన్నాయి. ఈ వాణిజ్య ఒప్పందాలు ఆర్ధిక వృద్ధికి దోహదపడతాయి. 2024-25లో దేశంలో అనేక ఆర్ధిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ.. ఆర్ధిక వ్యవస్థ బలంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. డిజిటల్ చెల్లింపులు కూడా దేశంలో అధికంగా ఉన్నాయి. మొత్తం మీద భారత్ ఆర్ధిక వ్యవస్థలో పురోగతి ఉంటుందని ఆర్‌బీఐ వెల్లడించింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)