రూపాయి రక్షణలో కరుగుతున్న ‘ఫారెక్స్‌’!

Published on Sat, 01/04/2025 - 08:10

రూపాయి మారకం విలువ ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా కొనసాగడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఫారెక్స్‌ నిల్వలను (Forex reserves) వినియోగిస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. సెప్టెంబర్‌ చివరిలో 704.885 బిలియన్‌ డాలర్ల ఆల్‌ టైమ్‌ గరిష్టానికి చేరిన ఫారెక్స్‌ నిల్వలు, డిసెంబర్‌ 27వ తేదీతో ముగిసిన వారానికి 640.279 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి.

అంతక్రితం వారం (డిసెంబర్‌ 21) వారంతో పోల్చితే ఏకంగా 4.11 బిలియన్‌ డాలర్లు తగ్గాయి. డాలర్లకు డిమాండ్‌ తగ్గించడానికి తద్వారా రూపాయి విలువ స్థిరత్వానికి  బ్యాంకులు, ఫారెక్స్‌ ట్రేడర్లకు ఆర్‌బీఐ తగిన స్థాయిలో అమెరికన్‌ కరెన్సీని అందుబాటులో ఉంచుతున్నట్లు నిపుణుల విశ్లేషణ.  ఫారెక్స్‌లో ప్రధాన విభాగాలను పరిశీలిస్తే..

  • డాలర్లలో పేర్కొనే ఫారెన్స్‌ కరెన్సీ అసెట్స్‌ విలువ 4.641 బిలియన్‌ డాలర్లు తగ్గి 551.921 బిలియన్‌ డాలర్లకు చేరింది.

  • పసిడి నిల్వలు 541 మిలియన్‌ డాలర్లు తగ్గి, 66.268 బిలియన్‌ డాలర్లకు దిగివచ్చాయి. 

  • ఐఎంఎఫ్‌ వద్ద స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌)కు సంబంధించి పరిమాణం 12 మిలియన్‌ డాలర్లు తగ్గి 17.873 బిలియన్‌ డాలర్లకు తగ్గింది.  

  • ఐఎంఎఫ్‌ వద్ద నిల్వల పరిస్థితి యథాతథంగా 4.217 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)