Breaking News

లక్ష్యంలో 86 శాతానికి ద్రవ్యలోటు 

Published on Sat, 03/29/2025 - 06:30

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) ఫిబ్రవరి చివరికి ద్రవ్యలోటు రూ.13,46,852 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో నిర్దేశించుకున్న మొత్తం ద్రవ్యలోటు లక్ష్యంలో 11 నెలల్లో 85.8 శాతానికి చేరుకుంది. వ్యయాలు–ఆదాయాల మధ్య అంతరాన్ని ద్రవ్యలోటుగా చెబుతారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు రూ.15.69 లక్షల కోట్లుగా ఉంటుందని బడ్జెట్‌ అంచనా. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) ఈ గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. ఫిబ్రవరి చివరికి నికర పన్నుల ఆదాయం రూ.20 లక్షల కోట్లుగా ఉంది. 2024–25 సవరించిన అంచనాల్లో ఇది 78.8 శాతానికి సమానం. 

అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 79.6 శాతంగా ఉండడం గమనార్హం. మొత్తం వ్యయాలు రూ.38.93 లక్షల కోట్లుగా ఉన్నాయి. సవరించిన బడ్జెట్‌ అంచనాల్లో ఇది 82.5 శాతానికి సమానం. జీడీపీలో ద్రవ్యలోటు 4.8 శాతంగా 2024–25 బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. 2025–26 సంవత్సరానికి దీన్ని 4.4 శాతంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. మొత్తం రెవెన్యూ వ్యయాల్లో 9.52 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులు కాగా, 3.63 లక్షల కోట్లు సబ్సిడీలకు ఖర్చు అయింది. 11.80 లక్షల కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేసినట్టు సీజీఏ తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోలి్చతే రాష్ట్రాలకు బదిలీ చేసిన మొత్తం రూ.1.47 లక్షల కోట్ల మేర పెరిగింది.   
 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)