Breaking News

భారత్‌ రోడ్లపై టెస్లా కారు.. మొదటి ఓనర్‌ ఈయనే..

Published on Sat, 05/03/2025 - 11:17

అమెరికాలో టాప్‌ ఎలక్ట్రిక్‌ వాహన తయారీదారుగా ఉన్న టెస్లా సంస్థ కార్లు భారత్‌లోకి ప్రవేశించాయి. సూరత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లవ్జీ దాలియా టెస్లా సైబర్‌ట్రక్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. వారం రోజులుగా టెస్లా సైబర్‌ట్రక్‌ సూరత్ రోడ్లపై కనిపిస్తూ సందడి చేస్తుంది. అయితే ఈ వాహనాన్ని దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు దాలియా కుమారుడు పీయూష్‌ తెలిపారు.

ధర రూ.60 లక్షలు..

లావ్జీ దాలియా కొనుగోలు చేసిన టెస్లా సైబర్‌ట్రక్‌ భారత్‌లోనే మొదటిదని పీయూష్‌ పేర్కొన్నారు. ‘మేము ఆన్‌లైన్‌లో తనిఖీ చేసిన దాని ప్రకారం, ఈ సైబర్‌ట్రక్‌ దేశంలోనే మొదటిది. అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న టెస్లా షోరూమ్‌లో ఆరు నెలల క్రితం ఈ కారును బుక్ చేశాం. కొద్దీ రోజుల కిందటే దీన్ని దుబాయ్‌లో డెలివరీ చేశారు. అక్కడి నుంచి భారత్‌ తీసుకొచ్చాం’ అని స్పష్టం చేశారు. ఈ సైబర్‌ట్రక్‌ వేరియంట్‌ ధర సుమారు రూ.60 లక్షలు ఉందని సోషల్‌ మీడియా ద్వారా తెలుస్తుంది.

ఇదీ చదవండి: కథన రంగంలో ఏఐ చిందులు

ఎవరీ లవ్జీ దాలియా?

‘లవ్జీ బాద్‌షా’గా పేరొందిన లవ్జీ దాలియా సూరత్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. దాంతోపాటు వజ్రాల వ్యాపారిగా, పవర్ లూమ్ యజమానిగా లావ్జీకి గుర్తింపు ఉంది. ఆయన చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలకు గుర్తింపుగా స్థానికులు తనను బాద్‌షాగా పిలుస్తున్నారు. గోపీన్ డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించారు. లాభాపేక్ష లేని సంస్థ గోపీన్ ఫౌండేషన్ ద్వారా దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫొటోను కూడా గతంలో షేర్ చేశారు.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)