Breaking News

భారత్‌లో తొలి E85 స్కూటర్ లాంచ్: ధర ఎంతో తెలుసా?

Published on Sun, 08/30/2026 - 05:07

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) దేశంలోని మొట్టమొదటి E85 స్కూటర్ ADV160 ధరను ప్రకటించింది. ఈ అడ్వెంచర్ స్టైల్ మ్యాక్సీ స్కూటర్ ధర రూ. 1.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ దీని కోసం బుకింగ్స్ రూ. 5,000 టోకెన్ మొత్తంతో స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు 2026 అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ADV160 స్కూటర్ ప్రత్యేకత దాని E85-అనుకూల ఇంజన్. ఇందులోని 157 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్.. 16.3 bhp పవర్, 14.9 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పవర్ CVT ద్వారా వెనుక చక్రానికి డెలివరీ అవుతుంది. ఇందులోని ఇంజిన్ 85 శాతం వరకు ఇథనాల్ మరియు 15 శాతం పెట్రోల్ కలిగిన ఇంధనంతో పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.

ADV160 సరికొత్త డిజైన్ పొందుతుంది. షార్ప్ బాడీ వర్క్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎత్తైన, అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, బ్లాక్-ప్యాటర్న్ టైర్లు ఉన్నాయి. పెరిగిన గ్రౌండ్ క్లియరెన్స్, పెద్ద చక్రాలు ఉండటం వల్ల ఈ స్కూటర్ కఠినమైన రోడ్ల మీద కూడా సజావుగా ముందుకు సాగుతుంది. హోండా ADV160ను "సిటీ అడ్వెంచర్" స్కూటర్‌గా అభివర్ణిస్తుంది.

హోండా తన ADV160లో చాలా ప్రీమియం ఫీచర్లను పొందుపరిచింది. ఇందులో ఫుల్ కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు హోండా రోడ్‌సింక్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కూడా ఉంది. దీని ద్వారా రైడర్లు నావిగేషన్, కమ్యూనికేషన్ సంబంధిత ఫంక్షన్‌లను యాక్సెస్ చేయవచ్చు. ఈ స్కూటర్‌లో ట్రాక్షన్-కంట్రోల్ సిస్టమ్‌గా పనిచేసే హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్‌తో పాటు, సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉంది. ఒక USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఉండనున్నట్లు సమాచారం. సీటు కింద ఉన్న 27-లీటర్ల స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ లభిస్తుంది.

హోండా కొత్తగా ప్రకటించిన 10 ఉత్పత్తుల 'మేడ్-ఇన్-ఇండియా' పోర్ట్‌ఫోలియోలో ADV160 ఒక భాగం . భారతదేశంలో ప్రత్యామ్నాయ ఇంధనాలకు సిద్ధంగా ఉన్న ద్విచక్ర వాహనాల దిశగా కంపెనీ తీసుకుంటున్న అతిపెద్ద అడుగులలో ఇది ఒకటి. ఈ స్కూటర్‌ను స్థానికంగా తయారు చేసి, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తారు.

Videos

బిర్యానీ సెంటర్లో పెరుగు కోసం కొట్లాట

కీవ్ లో రష్యా డ్రోన్ల బీభత్సం.. 37 మంది మృతి

నువ్వేం ఎమ్మెల్యే అమ్మ బాబు.. తాగడానికి నీళ్లు ఇవ్వడం చేతకాలేదు నీకు..!

'అచ్చ కాంగ్రెస్' వర్సెస్ 'పచ్చ కాంగ్రెస్' రేవంత్ కు ఎమ్మెల్యేల మద్దతు ఉందా?

మనిషి కంట్రోల్ తప్పిన 700 రోబోల రహస్య దాడి!

ఇరుముడి మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్ళే..!

మందాకిని ఉగ్రరూపం.. వరదల్లో ఉత్తర ప్రదేశ్

2 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా.. సాదిక్ ఖాన్ పాత్రపై పోలీసుల దర్యాప్తు

జనసేనలో బిగ్ ఫైట్.. లోకల్ ఎన్నికల్లో భారీ ఓటమి ఖాయం

వెలిగొండ వెలుగులు జగన్ వే

Photos

+5

చీరకట్టుతో రీతూ వర్మ ( ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉత్సాహంగా 10కె రన్ (ఫోటోలు)

+5

షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు)

+5

ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు)

+5

'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు)

+5

నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు

+5

మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దేవకన్యలా మెరిసిపోతున్న రాశీ (ఫొటోలు)