Breaking News

T V Narendren: రానున్న మూడు దశాబ్దాలు భారత్‌కు కీలకం

Published on Thu, 02/08/2024 - 06:25

జంషెడ్‌పూర్‌:  ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌కు రాబోయే మూడు దశాబ్దాలు అభివృద్ధి విషయంలో కీలకమైనవని  టాటా స్టీల్‌ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ టీవీ నరేంద్రన్‌ పేర్కొన్నారు. గత 30–40 ఏళ్లలో చైనా వేగంగా అభివృద్ధి చెందిందని, ఇక ఇదే విధమైన వృద్ధి తీరును భారత్‌ కొనసాగించే సమయం ఆసన్నమైందని ఇక్కడ సింగ్‌భూమ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎస్‌సీసీఐ) సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

► ప్రస్తుతం చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి చేసే దేశం. భారత్‌ రెండవ స్థానంలో ఉంది.  ఉక్కు రంగం ఎదుర్కొంటున్న ప్రపంచ సవాళ్లను, ధరలను దృష్టిలో ఉంచుకుని మనం విధాన కల్పనలో ముందుకుసాగాలి.  
► భారత్‌లో గత రెండు, మూడేళ్లలో మౌలిక సదుపాయాల రంగం ఊపందుకుంది.  దీని ఫలితంగా ప్రైవేట్‌ స్టీల్‌ దిగ్గజ సంస్థల ద్వారా సరఫరా పెరిగింది.  
► టాటా స్టీల్‌కు చెందిన జంషెడ్‌పూర్‌ ప్లాంట్‌ జనసాంద్రత కలిగిన ప్రాంతంలో ఉన్నందున, ఇక్కడి ప్లాంట్‌ను మరింత విస్తరించే అవకాశం లేదు.  
► సింగ్‌భూమ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీతో  టాటా స్టీల్‌ సంబంధాలు నిరంతరం బలపడుతున్నాయి.  ఇది మరింత పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుంది.  
► కంపెనీ వృద్ధిలో కారి్మకులు చేసిన త్యాగాలు చిరస్మరణీయం. టాటా స్టీల్‌ ఒక ‘‘బహుళ తరం కంపెనీ’’. టాటా స్టీల్‌– టాటా వర్కర్స్‌ యూనియన్‌ల మధ్య ఉన్న సత్సంబంధాలు కంపెనీని ముందుకు నడిపించాయి.  ప్రపంచ ఆర్థిక, ఫైనాన్షియల్‌ పరిస్థితులు అనిశి్చతిగా ఉన్నప్పటికీ కంపెనీ విజయాలు గర్వకారణం.  
► ఎకానమీ, పరిశ్రమల పురోగతిలో సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) కీలకం. ఎంఎస్‌ఎంఈ నాణ్యమైన ఉత్పత్తులపై ఆధారపడే పెద్ద పరిశ్రమలు పురోగమిస్తాయి. పెద్ద పరిశ్రమలకు ఎంఎస్‌ఎంఈలే వెన్నెముక. టాటా స్టీల్‌ ఒక పెద్ద కంపెనీ. దాని వెన్నెముక కూడా ఎంఎస్‌ఎంఈ యూనిట్లే. ఎంఎస్‌ఎంఈలకు సంబంధించినంత వరకు జంషెడ్‌పూర్‌ ఒక ముఖ్యమైన ప్రదేశం.  

సంస్థ పురోగతి హర్షణీయం: ఆనంద్‌ మూన్కా
కాగా, సింగ్‌భూమ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ప్రెసిడెంట్‌ విజయ్‌ ఆనంద్‌ మూన్కా తన స్వాగత ప్రసంగంలో నరేంద్రన్‌ అద్భుత నాయకత్వంలో టాటా స్టీల్‌ నిరంతరం అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. జంషెడ్‌పూర్‌ పరిసరాల్లో విమానాశ్రయం అభివృద్ధికి టాటా స్టీల్‌ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)