Breaking News

ఏప్రిల్‌లో ఎగుమతులు అప్‌

Published on Fri, 05/16/2025 - 06:05

న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్, ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు తదితర విభాగాలు మెరుగ్గా రాణించడంతో ఏప్రిల్‌లో ఎగుమతులు 9.03 శాతం వృద్ధి చెంది 38.49 బిలియన్‌ డాలర్లకు చేరాయి. మరోవైపు, ముడి చమురు, ఎరువుల వల్ల దిగుమతులు 19.12 శాతం పెరిగి 64.91 బిలియన్‌ డాలర్లకు ఎగిశాయి. దీంతో వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) గతేడాది నవంబర్‌ తర్వాత .. అయిదు నెలల గరిష్టమైన 26.42 బిలియన్‌ డాలర్లకు చేరింది. 

అప్పట్లో ఇది 31.77 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అంతర్జాతీయంగా అనిశి్చతులు ఉన్నప్పటికీ ఈ ఏడాది మొత్తం మీద ఎగుమతులు సానుకూల ధోరణి కొనసాగిస్తూ, గణనీయంగా వృద్ధి చెందగలవని ఆశిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ బరత్వల్‌ తెలిపారు. 20 దేశాలు, ఆరు కమోడిటీలపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్న వ్యూహం సత్ఫలితాలనిస్తోందని ఆయన చెప్పారు. 

త్వరలోనే పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక సవాళ్లు, కరెన్సీ హెచ్చుతగ్గులు, అమెరికా ప్రతీకార టారిఫ్‌ల విధానంతో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్‌ నుంచి అపారెల్‌ ఎగుమతులు 14.43 శాతం పెరిగినట్లు పరిశ్రమ మండలి ఏఈపీసీ సెక్రటరీ జనరల్‌ మిథిలేశ్వర్‌ ఠాకూర్‌ తెలిపారు. 

డేటా ప్రకారం.. 
→ ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు 39.51 శాతం పెరిగి 3.69 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు 11.28 శాతం వృద్ధితో 9.51 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  
→ పొగాకు, కాఫీ, మెరైన్‌ ఉత్పత్తులు, టీ, రెడీమేడ్‌ దుస్తులు, బియ్యం, రత్నాభరణాలు, సుగంధ ద్రవ్యాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్‌ ఎగుమతులు పెరిగాయి.  
→ క్రూడాయిల్‌ దిగుమతులు 25.6 శాతం పెరిగి 20.7 బిలియన్‌ డాలర్లకు చేరగా, పసిడి దిగుమతులు 4.86 శాతం వృద్ధితో 3.09 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  
→ సేవల ఎగుమతుల విలువ 30.18 బిలియన్‌ డాలర్ల నుంచి 35.31 బిలియన్‌ డాలర్లకు చేరింది. 
→ సేవల దిగుమతులు 16.76 బిలియన్‌ డాలర్ల నుంచి 17.54 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)