Breaking News

ఫి‍బ్రవరిలో ఎగుమతులు డౌన్‌

Published on Tue, 03/18/2025 - 05:14

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దేశ ఎగుమతులు వరుసగా నాలుగో నెలలోనూ క్షీణతను చవిచూశాయి. ఫిబ్రవరిలో 36.91 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు (రూ.3.21 లక్షల కోట్లు) నమోదయ్యాయి. క్రితం ఏడాది ఫిబ్రవరిలో ఎగుమతులు 41.41 బిలియన్‌ డాలర్లతో (రూ.3.60 లక్షల కోట్లు) పోల్చి చూస్తే 11 శాతం తగ్గిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఎగుమతులు 36.43 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 

ఫిబ్రవరి నెలలో దిగుమతులు సైతం 50.96 బిలియన్‌ డాలర్లకు (రూ.4.43 లక్షల కోట్లు) తగ్గుముఖం పట్టాయి. 2024 ఫిబ్రవరిలో దిగుమతులు 60.92 బిలియన్‌ డాలర్లుగా (రూ.5.30 లక్షల కోట్లు) ఉంటే, ఈ ఏడాది జనవరి నెలలో 59.42 బిలియన్‌ డాలర్ల మేర ఉండడం గమనార్హం. దీంతో వాణిజ్య లోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం) 14.05 బిలియన్‌ డాలర్లకు తగ్గుముఖం పట్టింది. 2021 ఆగస్ట్‌ తర్వాత అత్యంత కనిష్ట వాణిజ్య లోటు ఇదేనని వాణిజ్య శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఒక నెలలో కనిష్ట దిగుమతులు 2023 ఏప్రిల్‌ తర్వాత మళ్లీ 2025 ఫిబ్రవరిలోనే నమోదు కావడం గమనించొచ్చు. 

స్వల్పంగా తగ్గిన పసిడి దిగుమతులు 
→ ఫిబ్రవరి నెలలో బంగారం దిగుమతుల విలువ 2.3 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది జనవరిలో 2.68 బిలియన్‌ డాలర్ల విలువైన పసిడి దిగుమతి అయింది. 
→ జెమ్స్‌ అండ్‌ జ్యుయలరీ ఎగుమతులు 21 శాతం తగ్గి 2.53 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. 
→ జనవరితో పోల్చి చూస్తే చమురు దిగుమతులు 13.4 బిలియన్‌ డాలర్ల నుంచి 11.8 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. 
→ ఫిబ్రవరి నెలకు సేవల ఎగుమతులు 35 బిలియన్‌ 
డాలర్లుగా నమోదయ్యాయి. జనవరిలో ఈ మొత్తం 38.55 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  
→ ఫిబ్రవరిలో సేవల దిగుమతుల విలువ 16.55 బిలియన్‌ డాలర్లుగా ఉంది. జనవరిలో ఈ మొత్తం 18.22 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

800 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు..
2024–25లో సవాళ్లు నెలకొన్నప్పటికీ 800 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తు, సేవల ఎగుమతులు సాధిస్తామన్న విశ్వాసాన్ని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ భత్వాల్‌ వ్యక్తం చేశారు. వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడం అన్నది ప్రధానంగా చమురు, బంగారం, వెండి దిగుమతుల క్షీణతవల్లేనని ఇక్రా చీఫ్‌ ఎకనమిస్ట్‌ అదితి నాయర్‌ తెలిపారు.

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)