Breaking News

అయిదో భారీ ఏవియేషన్‌ మార్కెట్‌గా భారత్‌ 

Published on Sun, 08/10/2025 - 06:08

న్యూఢిల్లీ: గతేడాది 24.1 కోట్ల మంది ప్యాసింజర్లతో ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద ఏవియేషన్‌ మార్కెట్‌గా భారత్‌ ఆవిర్భవించింది. అత్యంత రద్దీగా ఉండే జంట విమానాశ్రయాల జాబితాలో ముంబై–ఢిల్లీకి చోటు దక్కింది. 2024 సంవత్సరానికి గాను అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌ సమాఖ్య ఐఏటీఏ విడుదల చేసిన వరల్డ్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

వీటి ప్రకారం గతేడాది భారత్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య 2023తో పోలిస్తే 11 శాతం పెరిగి 21.1 కోట్లుగా నమోదైంది. అత్యధికంగా 87.6 కోట్ల మంది ప్యాసింజర్లతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 74.1 కోట్ల మందితో చైనా రెండో స్థానంలో ఉంది. ఇక యునైటెడ్‌ కింగ్‌డం మూడో స్థానంలో (26.1 కోట్ల మంది) స్పెయిన్‌ 4వ స్థానంలో (24.1 కోట్ల మంది ప్రయాణికులు) నిల్చాయి. టాప్‌ 10 జంట ఎయిర్‌పోర్టుల్లో 59 లక్షల మంది ప్రయాణికులతో ముంబై–ఢిల్లీ జత 7వ ర్యాంకులో ఉంది. 

అంతర్జాతీయంగా ప్రీమియం క్లాస్‌ ప్రయాణాలు (బిజినెస్, ఫస్ట్‌ క్లాస్‌) 11.8 శాతం, ఎకానమీ ట్రావెల్‌ 11.5 శాతం పెరిగాయి. మొత్తం ఇంటర్నేషనల్‌ ప్యాసింజర్లలో ప్రీమియం క్లాస్‌ ట్రావెలర్లు 6 శాతం పెరిగి 11.69 కోట్లకు చేరింది. ప్రాంతాలవారీగా చూస్తే ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ప్రీమియం ప్యాసింజర్ల సంఖ్య 22.8 శాతం పెరిగి 2.1 కోట్లకు చేరింది. యూరప్, లాటిన్‌ అమెరికా, మధ్య ప్రాచ్యం, ఉత్తర అమెరికాల్లో ప్రీమియం ప్రయాణికుల సంఖ్య, ఎకా నమీ తరగతి వారికన్నా అధికంగా నమోదైంది.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)