Breaking News

వంట నూనెల దిగుమతులు తగ్గాయ్‌

Published on Sun, 11/17/2024 - 08:08

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వంట నూనెల దిగుమతులు 2023–24 ఆయిల్‌ మార్కెటింగ్‌ సంవత్సరానికి 3.09 శాతం తగ్గి 159.6 లక్షల టన్నులు నమోదయ్యాయి. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి పెరగడం, అధికం అవుతున్న ధరలతో డిమాండ్‌ తగ్గడం ఈ క్షీణతకు కారణమని సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈఏ) తెలిపింది.

ప్రపంచంలో అత్యధికంగా వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్న భారత్‌.. 2022–23 నవంబర్‌–అక్టోబర్‌ ఆయిల్‌ మార్కెటింగ్‌ ఏడాదికి 164.7 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంది. విదేశాల నుంచి భారత్‌ కొనుగోలు చేసిన ఈ నూనెల విలువ 2022–23తో పోలిస్తే రూ.1,38,424 కోట్ల నుంచి 2023–24లో రూ.1,31,967 కోట్లకు పడిపోయింది. వివిధ కారణాల వల్ల అంతర్జాతీయ ధరలు స్థిరపడ్డాయి. ఇది దేశీయ ధరల పెరుగుదలతో ప్రతిబింబించింది. అలాగే కొంత మేరకు దిగుమతులను తగ్గించింది’ అని అసోసియేషన్‌ తెలిపింది.  

విభాగాల వారీగా ఇలా.. 
ముడి పామాయిల్‌ దిగుమతులు 75.88 లక్షల టన్నుల నుంచి 69.70 లక్షల టన్నులకు వచ్చి చేరాయి. ఆర్‌బీడీ పామోలిన్‌ 21.07 లక్షల టన్నుల నుంచి 19.31 లక్షల టన్నులకు క్షీణించింది. సోయాబీన్‌ నూనె 35.06 లక్షల టన్నుల నుంచి 34.41 లక్షల టన్నులు నమోదైంది. పొద్దుతిరుగుడు నూనె 30.01 లక్షల టన్నుల నుంచి 35.06 లక్షల టన్నులకు ఎగసింది. శుద్ధి చేసిన నూనెల వాటా అయిదేళ్లలో 3 నుంచి ఏకంగా 12 శాతానికి దూసుకెళ్లింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)