Breaking News

భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం 

Published on Thu, 06/26/2025 - 06:36

ముంబై: అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల మధ్య భారత ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నట్టు ఆర్‌బీఐ బులెటిన్‌ తెలిపింది. పరిశ్రమలు, సేవల రంగాల్లో కార్యకలాపాలు ఇదే సూచిస్తున్నట్టు పేర్కొంది. వాణిజ్య విధాన పరమైన అనిశ్చితులకుతోడు పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ప్రస్తావించింది. ‘‘ఈ విధంగా అంతర్జాతీయ అనిశ్చితులు పెరిగిపోయిన తరుణంలోనూ 2025 మే నెలకు సంబంధించి అధిక ప్రాముఖ్యం కలిగిన సంకేతాలు.. పరిశ్రమలు, సేవల రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నట్టు సూచిస్తున్నాయి’’అని తన బులెటిన్‌లో పేర్కొంది. 

వ్యవసాయ రంగంలో 2024–25లో అన్ని ప్రధాన పంటల్లోనూ ఉత్పాదకత పెరిగినట్టు తెలిపింది. అదే సమయమంలో దేశీయంగా ధరలు సానుకూల స్థితిలోనే ఉన్నట్టు పేర్కొంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యం పరిధిలోనే వరుసగా నాలుగో నెలలోనూ నమోదైనట్టు తెలిపింది. వడ్డీ రేట్ల తగ్గింపును రుణ గ్రహీతలకు సమర్థవంతంగా బదిలీ చేసేందుకు వీలుగా సానుకూల ఆర్థిక పరిస్థితులు నెలకొన్నట్టు వివరించింది.

 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏప్రిల్‌ నెలలో 8.8 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయంటూ.. మార్చి నెలలో ఉన్న 5.9 బిలియన్‌ డాలర్లు, 2024 ఏప్రిల్‌ నెలలో ఎఫ్‌డీఐ 7.2 బిలియన్‌ డాలర్ల కంటే అధికమని పేర్కొంది. ఇదే సమయంలో మన దేశం నుంచి బయటకు వెళ్లిన ఎఫ్‌డీఐలు కూడా పెరిగినట్టు తెలిపింది. నికర ఎఫ్‌డీఐలు ఏప్రిల్‌ నెలలో అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే రెట్టింపై 3.9 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది. ఈ బులెటిన్‌లో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమే కానీ, ఆర్‌బీఐ అధికారిక అభిప్రాయాలు కాదని పేర్కొంది.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)