సరళీకరణ సరిహద్దు దేశాలకుకాదు!

Published on Thu, 03/12/2026 - 08:53

కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) నిబంధనల సరళీకరణ విదేశీ సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వ సీనియర్‌ అధికారి శివహరి పేర్కొన్నారు. 10 శాతంలోపు చైనీస్‌ వాటా కలిగిన ఇతర దేశాలకు చెందిన సంస్థలు దేశీయంగా ఎంపిక చేసిన రంగాలలో పెట్టుబడులు చేపట్టేందుకు ఆటోమాటిక్‌ మార్గంలో అనుమతి లభిస్తుందని తెలియజేశారు. అయితే చైనా, హాంకాంగ్‌ లేదా ఏ ఇతర సరిహద్దు పంచుకుంటున్న దేశాని(ఎల్‌బీసీ)కైనా తాజా సవరణలు వర్తించవని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య శాఖ(డీపీఐఐటీ) జాయింట్‌ సెక్రటరీ జై ప్రకాష్‌ శివహరి వెల్లడించారు.

ఇప్పటివరకూ సరిహద్దు దేశాల వాటాదారులుగా ఉన్న విదేశీ సంస్థలు దేశీయంగా ఇన్వెస్ట్‌ చేయాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవలసి ఉండేదని వివరించారు. ఈ నెల 10న కేంద్ర కేబినెట్‌ 2020 ప్రెస్‌ నోట్‌ 3లో సవరణలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటిపై శివహరి తాజా వివరణ ఇచ్చారు. వెరసి సరిహద్దు దేశాలన్నిటికీ ఎఫ్‌డీఐ ఆంక్షలు అమల్లో ఉన్నట్లు తెలియజేశారు. నాన్‌ఎల్‌బీసీ సంస్థలు 10 శాతంలోపు ఎల్‌బీసీ వాటాదారులుగా ఉన్నప్పుడు కొన్ని రంగాలలో ప్రత్యక్ష పెట్టుబడులకు తాజా సవరణల ద్వారా ఆటోమాటిక్‌ అనుమతి లభిస్తుందని వివరించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)