Breaking News

పరిశ్రమ వర్గాల వ్యతిరేకత.. స్థిరంగా ప్రభుత్వం

Published on Sun, 04/13/2025 - 09:51

భారతదేశం ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను(ఈ-వేస్ట్‌) సరైన విధంగా నిర్వహించాలని తీసుకొచ్చిన ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్‌ పాలసీని పరిశ్రమ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. మెరుగైన పర్యావరణం కోసం ఈ పాలసీని ప్రవేశపెట్టినా కంపెనీల ప్రతికూలతతో దీనిపై తీవ్ర చర్చ సాగుతోంది. ఈ విధానం వల్ల కంపెనీల ఆదాయాలు ప్రభావితం చెందుతున్నాయని సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. అయినప్పటికీ దీర్ఘకాలంలో పర్యావరణ ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతుంది. కాగా, డైకిన్, హిటాచీ, శామ్‌సంగ్‌ వంటి దిగ్గజ కంపెనీలు సహా ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీదారులు ఈ పాలసీలోని అంశాలను వ్యతిరేకిస్తున్నాయి.

ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లు వంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను లక్ష్యంగా చేసుకుని ఈ-వ్యర్థాల రీసైక్లింగ్ కోసం ఈ విధానం కఠినమైన ఆదేశాలను ప్రవేశపెట్టింది. ఈ-వేస్ట్ రీసైక్లింగ్ ఎకోసిస్టమ​్‌ను క్రమబద్ధీకరించడానికి రూపొందించిన విధానాల కోసం కంపెనీలు అధిక మొత్తంలో వెచ్చించాల్సి రావడమే దీని వ్యతిరేకతకు కారణం. కొన్ని సందర్భాల్లో రీసైక్లింగ్‌ ఖర్చులు మూడింతలు అవుతుండడంతో ఆయా కంపెనీల ఆదాయాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మెరుగైన ఈ-వేస్ట్‌ నిర్వహణే లక్ష్యంగా

ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మూడో అతిపెద్ద ఈ-వేస్ట్ ఉత్పత్తిదారుగా ఉంది. పట్టణీకరణ వేగంగా విస్తరించడం, సాంకేతికత పెరుగుతుండడంతో ఈ-వేస్ట్‌ కూడా అందుకు అనుగుణంగానే అధికమవుతుంది. దాంతో పర్యావరణ పరిణామాలను పరిష్కరించడానికి ప్రభుత్వం విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ-వేస్ట్‌ నిర్వహణ కోసం అధిక రీసైక్లింగ్ ఫీజులను అమలు చేయడం ద్వారా బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

అనవసరమైన ఆర్థిక ఒత్తిడి

ఈ విధానంపై ఎలక్ట్రానిక్స్ సంస్థల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెరిగిన ఖర్చులు వ్యాపారాలపై అనవసరమైన ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తాయని చెబుతున్నాయి. దీనికితోడు ఈ పాలసీలోని నిబంధనల అమలు కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని తెలుపుతున్నాయి. ఇది వినియోగదారులకు కంపెనీ ఉత్పత్తుల ధరలు పెరగడానికి దారితీస్తాయని వాదిస్తున్నాయి. ఈ విధానం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కొన్ని కంపెనీలు న్యాయపరమైన సవాళ్లను కూడా దాఖలు చేశాయి. ఈ ఆకస్మిక మార్పులు సరఫరా గొలుసులకు అంతరాయం కలిగిస్తాయని తెలిపాయి. అధిక పోటీ మార్కెట్లో సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తాయని భావిస్తున్నాయి.

ఇదీ చదవండి: ఈవీలపై మహిళలకు రూ.36,000 రాయితీ.. లిమిటెడ్‌ ఆఫర్‌

పాలసీ ప్రతిపాదకుల వాదన ఇదే..

ఈ పాలసీపై కంపెనీల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రభుత్వ విధానాల్లో ఎలాంటి మార్పులు లేవు. పెరుగుతున్న ఈ-వ్యర్థాల సమస్యను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం నొక్కి చెప్పింది. స్వల్పకాలిక ఆర్థిక భారాల కంటే దీర్ఘకాలిక పర్యావరణ ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని ఈ విధానం ప్రతిపాదకులు తెలుపుతున్నారు. ఈ-వేస్ట్ రీసైక్లింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం వల్ల ఉద్యోగాలు సృష్టించబడతాయని చెబుతున్నారు. కార్మికుల భద్రత మెరుగుపడుతుందని, హానికర పదార్థాలను సరిగ్గా నిర్వహించేలా చూడవచ్చని అభిప్రాయపడుతున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)