Breaking News

ఆకాశవీధిలో 1.36 కోట్ల మంది

Published on Tue, 11/26/2024 - 13:00

దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 2024 అక్టోబరులో 1.36 కోట్లు నమోదైందని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) వెల్లడించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ప్యాసింజర్ల సంఖ్య 5.3 శాతం పెరిగిందని వివరించింది.

డీజీసీఏ తెలిపిన వివరాల ప్రకారం.. 2023 అక్టోబరులో 1.26 కోట్ల మంది దేశీయంగా వివిధ నగరాలకు విమాన ప్రయాణాలు సాగించారు. 2024 అక్టోబరులో బడ్జెట్‌ క్యారియర్‌ ఇండిగో 86.40 లక్షల మందిని వివిధ గమ్య స్థానాలకు చేర్చింది. తద్వారా 63.3 శాతం మార్కెట్‌ వాటాను సాధించింది. టాటా గ్రూప్‌ నడుపుతున్న ఎయిరిండియా 26.48 లక్షలు, విస్తారా 12.43 లక్షల మందికి సేవలు అందించాయి. ఎయిరిండియా గణాంకాల్లో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ప్యాసింజర్ల సంఖ్య కలిసే ఉంది.

ఇదీ చదవండి: మళ్లీ అవకాశం రాదేమో! తగ్గిన బంగారం ధరలు..

ఎయిరిండియా తన అనుబంధ సంస్థ ఏఐఎక్స్‌ కనెక్ట్‌ను తన అంతర్జాతీయ బడ్జెట్‌ విభాగం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌తో 2024 అక్టోబర్‌ 1న విలీనం చేసింది. గత నెలలో టాటా గ్రూప్‌ విమాన సంస్థ మార్కెట్‌ వాటా 19.4 శాతం కాగా, విస్తారా 9.1 శాతంగా ఉంది. గతంలో టాటా సన్స్, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ మధ్య 51:49 శాతం జాయింట్‌ వెంచర్‌ అయిన విస్తారా కూడా నవంబర్‌ 12న ఎయిరిండియాలో విలీనం అయింది. రెండు టాటా గ్రూప్‌ ఎయిర్‌లైన్స్‌ (ఎయిరిండియా, విస్తారా) గత నెలలో మొత్తం దేశీయ ప్రయాణికుల రద్దీలో 28.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆకాసా ఎయిర్‌ 6.16 లక్షల మందితో 5.4 శాతం, స్పైస్‌జెట్‌ 3.35 లక్షల మందితో 2.4 శాతం వాటా దక్కించుకున్నాయి.
 

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు