Breaking News

భారత ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఎంతంటే..

Published on Sat, 04/26/2025 - 11:46

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో భారతదేశం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గణనీయమైన వృద్ధిని సాధించింది. స్థూల వసూళ్లు 15.59% పెరిగి రూ.27.02 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అధిక కార్పొరేట్, నాన్-కార్పొరేట్ పన్ను ఆదాయాలు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్‌టీటీ) రాబడుల్లో పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల దేశం బలమైన ఆర్థిక కార్యకలాపాలు, మెరుగైన పన్ను విధానాన్ని ప్రతిబింబిస్తుంది.

  • కార్పొరేట్ ట్యాక్స్ రాబడులు: కార్పొరేట్ పన్ను వసూళ్లు 2024-25లో రూ.12.72 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందకు ఏడాది ఇది రూ.11.31 లక్షల కోట్లుగా ఉంది.

  • నాన్ కార్పొరేట్ ట్యాక్స్ రెవెన్యూ: నాన్ కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.11.68 లక్షల కోట్ల నుంచి 2024-25లో రూ.13.73 లక్షల కోట్లకు పెరిగాయి.

  • సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్‌టీటీ): క్యాపిటల్ మార్కెట్లలో కార్యకలాపాలు పెరగడంతో ఎస్‌టీటీ రాబడులు రూ.34,192 కోట్ల నుంచి రూ.53,296 కోట్లకు పెరిగాయి.

నికర పన్ను వసూళ్లు, రీఫండ్‌లు

రిఫండ్లను పరిగణనలోకి తీసుకుంటే నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.22.26 లక్షల కోట్లలో 26.04 శాతం పెరిగి రూ.4.76 లక్షల కోట్లకు చేరాయి.  2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.19.60 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 13.57% పెరుగుదలను సూచిస్తుంది. ఇది ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ చట్టబద్ధమైన రీఫండ్ క్లెయిమ్‌లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తుంది.

ఇదీ చదవండి: ఏడాదిలో రూ.21.16 లక్షల కోట్లు గీకారు!

వృద్ధికి సంకేతం

ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరగడం భారత ఆర్థిక వృద్ధికి సానుకూల సంకేతం. ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేయడం, రుణాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది. అధిక పన్ను ఆదాయాలు మౌలిక సదుపాయాలు, సాంఘిక సంక్షేమం, ఇతర కీలక రంగాలపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచడానికి వీలు కల్పిస్తాయి.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)