కాకినాడ జిల్లా సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి
Breaking News
ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 18.38 లక్షల కోట్లు
Published on Tue, 01/13/2026 - 05:05
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి జనవరి 11 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా రూ. 18.38 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 8.82 శాతం పెరిగాయి. కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు పెరగడం, పన్నుల రిఫండ్లు నెమ్మదించడం ఇందుకు కారణం.
ఆదాయ పన్ను శాఖ సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం కార్పొరేట్ ట్యాక్స్‌ల వసూళ్లు నికరంగా 12.4 శాతం పెరిగి రూ. 8.63 లక్షల కోట్ల కు చేరగా, వ్యక్తుల–హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), కార్పొరేట్యేతర వర్గాల నుంచి వసూళ్లు 6.39 శాతం పెరిగి రూ. 9.30 లక్షల కోట్లకు చేరాయి.
సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను వసూళ్లు ఫ్లాట్‌గా రూ. 44,867 కోట్లుగా ఉన్నాయి. ట్యాక్స్ రిఫండ్లు 17 శాతం క్షీణించి రూ. 3.12 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. మరోవైపు, సమీక్షాకాలంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 4.14 శాతం పెరిగి రూ. 21.50 లక్షల కోట్లకు చేరాయి.
Tags : 1