Breaking News

మనకూ సొం‍త ఏఐ మోడల్‌ !

Published on Fri, 01/31/2025 - 05:52

న్యూఢిల్లీ: కృత్రిమ మేథకి (ఏఐ) సంబంధించి చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌ ఆర్‌1లకు దీటుగా మన సొంత ఫౌండేషన్‌ మోడల్స్‌ను ప్రోత్సహించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అంకుర సంస్థలు, పరిశోధకులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను చౌకగా అందుబాటులోకి తెస్తోంది. వీటి దన్నుతో వచ్చే 8–10 నెలల వ్యవధిలో కనీసం ఆరు పెద్ద డెవలపర్లు/స్టార్టప్‌లు పూర్తి దేశీయ సామర్థ్యంతో, దేశీ అవసరాల కోసం ఫౌండేషన్‌ మోడల్స్‌ను తయారు చేయగలవని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ధీమా వ్యక్తం చేశారు. మరింతగా దృష్టి పెడితే 4–6 నెలల వ్యవధిలో కూడా ఇవి సాధ్యపడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 

ఏఐ మార్గదర్శ ప్రణాళికలో తదుపరి చర్యలను మంత్రి గురువారం వెల్లడించారు. దీని ప్రకారం ఏఐ ఫౌండేషన్‌ మోడల్స్‌పై పని చేసే అంకురాలు, పరిశోధకులకు 18,693 అత్యాధునిక గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల (జీపీయూ) ఉమ్మడి కంప్యూటింగ్‌ సామర్థ్యం అందుబాటులోకి రానుంది. జియో ప్లాట్‌ఫామ్స్, సీఎంఎస్‌ కంప్యూటర్స్, టాటా కమ్యూనికేషన్స్‌ మొదలైన సంస్థలు ఈ జీపీయూలను అందుబాటులో ఉంచుతాయి. అంతర్జాతీయ వ్యయ ప్రమాణాలతో పోలిస్తే ఉమ్మడి కంప్యూటింగ్‌ సదుపాయం దేశీయంగా ఒక డాలరు కన్నా తక్కు వకే (జీపీయూ అవర్‌కి) లభిస్తుందని, 40% వ్య యాన్ని ప్రభుత్వమే భరిస్తుందని వైష్ణవ్‌ తెలిపారు.

ఏఐ సేఫ్టీ...: ఫౌండేషనల్‌ మోడల్స్‌ సురక్షితంగా, విశ్వసనీయమైనవిగా ఉండేలా చూసేందుకు ఏఐ సేఫ్టీ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు మంత్రి చెప్పారు. దీని కింద మెషిన్‌ అన్‌లెర్నింగ్‌ (ఐఐటీ జో«ద్‌పూర్‌), సింథటిక్‌ డేటా జనరేషన్‌ (ఐఐటీ రూరీ్క), ప్రైవసీ ఎన్హాన్సింగ్‌ స్ట్రాటెజీ (ఐఐటీ ఢిల్లీ, ట్రిపుల్‌ ఐటీ ఢిల్లీ, టీఈసీ) తదితర ప్రాజెక్టులు ఎంపికైనట్లు ఆయన వివరించారు.

ఇండియా ఏఐ మిషన్‌.. 
కృత్రిమ మేథ సహకారంతో ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, లాజిస్టిక్స్‌ తదితర సవాళ్ల పరిష్కారానికి ఉద్దేశించి ఆవిష్కరించిన ఏఐ మిషన్‌ కింద పలు దరఖాస్తులు వచి్చనట్లు వైష్ణవ్‌ చెప్పారు. తొలి విడత ఫండింగ్‌ కోసం 18 అప్లికేషన్లను ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇవి వ్యవసాయం, వాతావరణ మార్పులు మొదలైన అంశాలపై పని చేస్తున్నట్లు వివరించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)