Breaking News

చమురుపై ఇక విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌లు ఉండవు

Published on Fri, 03/21/2025 - 07:49

న్యూఢిల్లీ: ఆయిల్‌ఫీల్డ్స్‌ (నియంత్రణ, అభివృద్ధి) బిల్లు అమల్లోకి వచ్చాక చమురు, గ్యాస్‌ కంపెనీల అసాధారణ లాభాలపై విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ల్లాంటి కొత్త పన్ను ల విధింపు బాదరబందీ ఉండదని కేంద్ర పెట్రోలి యం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేయడాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయం చెప్పారు. ఇన్వెస్టర్లకు ఆర్థిక విధానాల స్థిరత్వంపై కొత్త చట్టం భరోసా కల్పిస్తుందని పురి వివరించారు.

అంతర్జాతీయంగా పలు ఆయిల్‌ దిగ్గజాలు భారత్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ ఆయిల్‌ ఇండియాతో బ్రెజిల్‌కి చెందిన పెట్రోబ్రస్, ఓఎన్‌జీసీతో ఎక్సాన్‌మొబిల్, ఈక్వినార్‌ వంటి సంస్థలు చర్చలు జరుపుతున్నట్లు మంత్రి వివరించారు. ఇతర దేశాల తరహాలోనే, ఇంధన కంపెనీలకు వచ్చే అసాధా రణ లాభాలపై 2022 జూలై 1 నుంచి భారత్‌ విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యా క్స్‌లు విధించడం మొదలుపెట్టింది.

పెట్రోల్‌.. ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 6 చొప్పున, డీజిల్‌పై లీటరుకు రూ. 13 చొప్పున ఎగుమతి సుంకాలు విధించింది. దేశీయంగా క్రూడాయిల్‌ ఉత్పత్తిపైనా టన్నుకు రూ. 23,250 చొప్పున విధించింది. పలుమార్లు సవరించిన ఈ ట్యాక్స్‌లను 30 నెలల తర్వాత గతేడాది డిసెంబర్‌లో నిలిపివేసింది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)