Breaking News

దేశానికి కరెంట్‌ అకౌంట్‌ లోటు కష్టాలు

Published on Sat, 09/10/2022 - 07:16

ముంబై: భారత్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) కరెంట్‌ అకౌంట్‌ లోటు (సీఏడీ– క్యాడ్‌) కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని దేశీయ రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తోంది. జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఈ లోటు అదే కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే 5 శాతానికి చేరే వీలుందని ఇక్రా అభిప్రాయపడింది. అదే విధంగా 2022–23లో 3.5 శాతంగా ఉండే వీలుందని అంచనావేసింది. దేశం నుంచి ఎగుమతులు తగ్గుతుండడం, దిగుమతుల పెరుగుదల, దీనితో భారీగా పెరగనున్న వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) వంటి అంశాలు క్యాడ్‌ ఆందోళనకు కారణమని ఇక్రా విశ్లేషించింది. నివేదికకు సంబంధించి ముఖ్యాంశాలు... 

►ఒక్క ఆగస్టును తీసుకుంటే వాణిజ్య లోటు రెట్టింపై 28.7 బిలియన్‌ డాలర్లకు చేరింది. భారత్‌ ఎగుమతులు 20 నెల్లో మొదటిసారి ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా  1.15 శాతం మేర క్షీణించడం, (విలువలో 33 బిలియన్‌ డాలర్లు) దిగుమతులు 37 శాతం పెరిగి, 61.68 బిలియన్‌ డాలర్లుగా నమోదవడం దీనికి కారణం. ఎగుమతుల ద్వారా ఆదాయం తగ్గడం క్యాడ్‌పై ప్రభావం చూపింది.  

►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో క్యాడ్‌ విలువ ఆల్‌టైమ్‌ హై 41 బిలియన్‌ డాలర్ల నుంచి 43 బిలియన్‌ డాలర్ల శ్రేణిలో (జీడీపీ విలువ అంచనాలో దాదాపు 5 శాతం) నమోదుకావచ్చు. 2022–23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) ఈ విలువ 30 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  

►అయితే ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో (అక్టోబర్‌–మార్చి) క్యాడ్‌ 2.7 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. దీనివల్ల ఆర్థిక సంవత్సరం మొత్తంలో క్యాడ్‌ 3.5 శాతానికి పరిమితం కావచ్చు. కమోడిటీల బిల్లు తగ్గే అవకాశాలు, సీజనల్‌గా ఎగుమతులు కొంచెం మెరుగుపడే పరిస్థితులు దీనికి కారణం. అయితే దిగ్గజ ఎకనామీల్లో మాంద్యం పరిస్థితుల వల్ల దేశం వస్తు, సేవల ఎగుమతులు  అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. 

►ఆర్థిక సంవత్సరం (2022–23)లో క్యాడ్‌ 120 బిలియన్‌ డాలర్లు (జీడీపీలో 3.5 శాతం)గా ఉండే వీలుంది. 2021–22లో ఈ విలువ కేవలం 38.7 బిలియన్‌ డాలర్లు. అంటే జీడీపీలో 1.2%.  

►ఇక రూపాయి విషయానికి వస్తే, 2022 రానున్న కాలంలో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 78.5–81 శ్రేణిలో తిరిగే వీలుంది. ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) ఈక్విటీ ఇన్‌ఫ్లోస్‌ పెరగవచ్చు.  

►2021 సెప్టెంబర్‌ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అయితే అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు భారత్‌ దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. భారత్‌ వద్ద ప్రస్తుతం  (26 ఆగస్టు నాటికి 561 బిలియన్‌ డాలర్లు) విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకోడానికి దోహదపడతాయి. రూపాయి తీవ్ర ఒడిదుడుకులను నివారిస్తాయి.  

క్యాడ్‌ అంటే... 
ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్‌ అకౌంట్‌’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్‌ అకౌంట్‌ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్‌ అకౌంట్‌ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు.

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)