72 లక్షల ’హరిత’ కొలువులు 

Published on Sun, 06/08/2025 - 06:37

ముంబై: దేశీయంగా పర్యావరణహిత (గ్రీన్‌) సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవడంపై భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో 2027–28 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ రంగంలో 72.9 లక్షల కొలువులు రానున్నాయి. రెన్యూవబుల్‌ ఎనర్జీ, వ్యర్థాల నిర్వహణ, ఎలక్ట్రిక్‌ వాహనాలు, పర్యావరణహిత నిర్మాణాలు మొదలైన విభాగాల్లో అత్యధికంగా ఉద్యోగాల కల్పన జరగనుంది.

 గ్లోబల్‌ టెక్నాలజీ, డిజిటల్‌ టాలెంట్‌ సొల్యూషన్స్‌ సేవల సంస్థ ఎన్‌ఎల్‌బీ సరీ్వసెస్‌ ఒక నివేదికలో ఈ అంశాలు తెలిపింది. పరిశ్రమలో ధోరణులు, డిమాండ్, స్థూల వ్యవస్థ మొదలైన వాటిపై విశ్లేషణ ఆధారంగా దీన్ని రూపొందించింది. దీని ప్రకారం .. దేశీ కార్పొరేట్లు పర్యావరణానికి పెద్ద పీట వేస్తున్న నేపథ్యంలో 2047 నాటికి 3.5 కోట్ల కొత్త కొలువులు వచ్చే అవకాశం ఉందని వివరించింది.

  ‘గత 4–5 ఏళ్లలో పునరుత్పాదక విద్యుత్, ఈవీ, పర్యావరణహిత మౌలిక సదుపాయాలరంగంలో కొత్త కొలువులు వస్తున్నాయి. నైపుణ్యాల అవసరాలు మారుతున్నాయి. పర్యావరణహితమైన విధంగా విధులను నిర్వర్తించడంతో పాటు డిజిటల్‌ సామర్థ్యాలు కూడా కావాల్సి ఉంటోంది. ఏఐ, ఐవోటీ, బ్లాక్‌చెయిన్, జీఐఎస్, డేటా ఆధారిత టూల్స్‌లాంటివి కొత్త కెరియర్లకు బాటలు వేస్తున్నాయి‘ అని ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ సీఈవో సచిన్‌ అలగ్‌ చెప్పారు. నియామకాల విషయంలో సంప్రదాయ విద్యార్హతల కన్నా నైపుణ్యాలకు కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయని వివరించారు.  

మరిన్ని విశేషాలు..
→ గ్రీన్‌ ఉద్యోగార్థులకు ముంబై, బెంగళూరు, ఢిల్లీ లాంటి మెట్రో నగరాలు ఆకర్షణీయంగా ఉంటు న్నాయి. విశాఖపట్నం, ఇండోర్, అహ్మదాబాద్, జైపూర్‌ తదితర ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అవకాశాలు ఉంటున్నాయి.  
→ లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, పర్యావరణహిత వ్యవసాయం లాంటి రంగాలు ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లో సానుకూల హైరింగ్‌కి తోడ్పడనున్నాయి. గ్రీన్‌ విభాగంలో కొత్తగా వచ్చే 72.9 లక్షల కొలువుల్లో 35–40 శాతం ఉద్యోగాలు ఈ నగరాల్లోనే ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి.  
→ ప్రస్తుతం దేశీయంగా గ్రీన్‌ జాబ్స్‌లో మహిళల వా టా 11–12 శాతంగానే ఉంది. సాంకేతిక విద్య అంతగా అందుబాటులో లేకపోవడం, సంస్కృతిపరమై న అడ్డంకులు, వర్క్‌ప్లేస్‌లో భద్రతాపరమైన సవాళ్లు ఇందుకు కారణం. సంస్థలు సమ్మిళిత నియామక విధానాలను అమలు చేస్తున్నాయి. ప్రధానంగా మహిళల కోసం నైపుణ్యాల్లో శిక్షణ కల్పనపై ఇన్వెస్ట్‌ చేస్తున్నాయి. దీనితో గ్రీన్‌ జాబ్స్‌లో మహిళల వాటా వచ్చే 5–6 ఏళ్లలో మరింత మెరుగుపడనుంది.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)