Breaking News

భారత్‌ కార్పొరేట్‌ ఆదాయాలు 12% డౌన్‌!

Published on Mon, 04/17/2023 - 05:01

ముంబై: భారత్‌ కార్పొరేట్‌ ఆదాయాలు గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2022–23, జనవరి–మార్చి) 10 నుంచి 12 శాతం పడిపోతాయని భావిస్తున్నట్లు క్రిసిల్‌ మార్కిట్‌ ఇంటిలిజెన్స్‌ తాజా నివేదిక పేర్కొంది. 2021–22 ఇదే కాలంలో ఆదాయాల వృద్ధి 22.8 శాతంగా ఉంది. కంపెనీలు నాల్గవ త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తున్న నేపథ్యంలో తాజా నివేదిక వెలువడ్డం గమనార్హం.  47 రంగాలకు చెందిన 300 కంపెనీల గణాంకాల విశ్లేణలనకు అనుగుణంగా తాజా నివేదిక వెలువడింది. హై బేస్‌ కూడా తాజా అంచనాలు ‘తగ్గించడానికి’ కారణమని క్రిసిల్‌ వర్గాలు వెల్లడించాయి.  నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

► 2021–22లో కంపెనీల ఆదాయాల వృద్ధి 27 శాతం కాగా, 2022–23లో ఇది 19 నుంచి 21 శాతానికి పరిమితం కానుంది.  
► నిర్వహణా లాభాలు కేవలం 3 శాతంగా ఉండనుంది.
► కంపెనీల ఆదాయాలపై ఎగుమతుల మందగమన ప్రభావం పడనుంది.  
► వస్తువులు, ఎగుమతి ఆధారిత రంగాలైన టెక్స్‌టైల్స్, రత్నాలు–ఆభరణాలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–ఎనేబుల్డ్‌ సర్వీసుల ఆదాయాలు తగ్గుముఖం పట్టాయి.
► 2022లో మేలో ఎగుమతి సుంకాలు విధించడం వల్ల స్టీల్‌ ఉత్పత్తి సంస్థల ఆదాయాలు 7 నుంచి 9 శాతం వరకూ పడిపోవచ్చు. అంతర్జాతీయ మందగమన పరిస్థితులూ దీనికి కారణం కావచ్చు.   
► మందగమనం వల్ల అల్యూమినియం ఇండస్ట్రీ ఆదాయాలు కూడా 17 నుంచి 19 శాతం వరకూ పడిపోవచ్చు.
► ఎయిర్‌లైన్స్, హోటళ్లు, మీడియా, వినోదం, రిటైల్‌ వంటి వినియోగదారుల విచక్షణ ఉత్పత్తులు ఆదాయ వృద్ధికి దారితీశాయి. అలాగే ఫార్మాస్యూటికల్స్, ఫాస్ట్‌ మూవింగ్‌ కన్సూ్యమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) వంటి       వినియోగదారులకు డిమాండ్‌ వృద్ధి కొనసాగుతుంది.  
► హోటళ్ల పరిశ్రమల 98 శాతం పురోగమించే వీలుంది. ఎయిర్‌లైన్స్‌ 67 శాతం శాతం పెరిగితే, టెల్కోల ఆదాయాలు 13 శాతం పెరిగవచ్చు.  
► ముడి చమురు, నాన్‌–కోకింగ్‌ బొగ్గు వంటి కీలకమైన ఎనర్జీ సంబంధ కమోడిటీల ధరలు వాటి గరిష్ఠ స్థాయిల నుండి దిగివస్తున్నట్లు కనిపిస్తోంది. మందగమన ప్రపంచ డిమాండ్‌ ప్రభావాన్ని ఈ ‘తగ్గిన ధరలు’ పాక్షికంగా భర్తీ చేస్తాయి.  ఈ ఆర్థిక సంవత్సరంలో (2023–24) కమోడిటీ ధరలు తగ్గుముఖం పట్టడం, వాణిజ్య పరిమాణాలు పెరగడం వల్ల కార్పొరేట్ల  లాభదాయకత మెరుగుపడే అవకాశం ఉంది.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)