Breaking News

భారత కార్బన్‌ మార్కెట్ ప్రారంభం..

Published on Mon, 04/28/2025 - 15:02

భారత్‌తోపాటు ప్రపంచం అంతటా వాతావరణ కాలుష్యం ప్రధాన సమస్యగా మారుతోంది. ఇందుకు కార్బన్‌ ఉద్గారాలు కీలకంగా ఉన్నాయి. వివిధ ఉత్పత్తుల తయారీలో భాగంగా వీటిని విడుదల చేస్తున్న కంపెనీలపై కాలుష్య నియంత్రణ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా అల్యూమినియం, సిమెంట్, క్లోర్-ఆల్కలీ, పేపర్‌ ఇండస్ట్రీల్లో 282 యూనిట్లకు నిర్దిష్ట ఉద్గార తీవ్రత లక్ష్యాలను నోటిఫై చేయడం ద్వారా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల సమస్యను కొంతవరకు కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కర్బన ఉద్గారాలను నియంత్రించడం, పరిశ్రమల్లో స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా కార్యాచరణను తయారుచేసింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ మార్గదర్శకాల ప్రకారం పవర్ ఎక్స్ఛేంజీల్లో కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్లు ట్రేడ్ కావడంతో భారతదేశం ఇటీవల తన కార్బన్ మార్కెట్‌ను ప్రారంభించింది.

కాంప్లయన్స్ కార్బన్ మార్కెట్

పరిశ్రమలు ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాల మేరకే ఉత్పత్తులను తయారు చేయాల్సి ఉంటుంది. బాధ్యతాయుతమైన సంస్థలు (ఆబ్లిగేటెడ్‌ ఎంటిటీస్‌-ఓఈ) ఉద్గార పరిమితులను చేరుకోవాలి. ఈ పరిమితుల కంటే అధికంగా ఉద్గారాలు ఉంటే చర్యలు తప్పవు. టన్ను కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించినా లేదా నివారించినా కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్లను జారీ చేస్తారు. ఈ ధ్రువీకరణ పత్రాలను రెగ్యులేటర్లకు సమర్పించాల్సి ఉంటుంది. వీటిని పాటించనందుకు జరిమానాలు సైతం విధించేలా నిబంధనలు సిద్ధం చేశారు.

కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్లు అంటే..

ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్ (CO2) లేదా గ్రీన్ హౌస్ వాయువులు (GHG) నివారిస్తే కంపెనీల​కు ప్రత్యేకంగా ఇచ్చే సర్టిఫికేట్లు. కంపెనీలు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి, ఆ దిశగా సంస్థలను ప్రోత్సహించడానికి వీటిని రూపొందించారు. ఒక ప్రాజెక్ట్ విజయవంతంగా GHG ఉద్గారాలను తగ్గించినప్పుడు నియంత్రణ సంస్థలు లేదా స్వతంత్ర సంస్థల ద్వారా కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్‌లు జారీ చేస్తారు. ఉదాహరణకు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు లేదా అడవుల పెంపకం కార్యక్రమాలతో ఈ క్రెడిట్లను సంపాదించవచ్చు.

ఉద్గారాల పరిమితిని దాటిన కంపెనీలు మిగులు క్రెడిట్లు ఉన్న సంస్థల నుంచి ఈ సర్టిఫికేట్లను కొనుగోలు చేయవచ్చు. ఇది ఉద్గారాల తగ్గింపునకు మార్కెట్ ఆధారిత విధానాన్ని సృష్టిస్తుంది. సంస్థలు ఉద్గారాలను తగ్గించడం లేదా కార్బన్ క్రెడిట్లను కొనుగోలు చేయడం ద్వారా లక్ష్యాలను చేరుకోవాలి. దీన్ని పాటించడంలో విఫలమైతే జరిమానాలు తప్పవు. కార్పొరేట్ సామాజిక బాధ్యత లేదా నైతిక పద్ధతుల్లో భాగంగా కంపెనీలు తమ ఉద్గారాలను భర్తీ చేయడానికి స్వచ్ఛందంగా కార్బన్ క్రెడిట్లను కొనుగోలు చేయవచ్చు.

ఇదీ చదవండి: భారత్‌లో తగ్గిన పేదరికం! ఎలాగంటే..

ప్రయోజనాలు

ఇది క్రెడిట్‌ సర్టిఫికేట్లు కలిగి ఉన్న కంపెనీలకు సుస్థిర ప్రాజెక్టుల్లో పెట్టుబడులు వచ్చేలా ప్రోత్సహిస్తుంది. ఉద్గారాల తగ్గింపునకు సంస్థలకు ఆర్థిక వెసులుబాటు అందిస్తుంది. వాతావరణ కాలుష్య కట్టడికి ఇతర కంపెనీలకు తోడ్పడుతుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)